న్యూస్ రౌండప్ టాప్ 20

1.అంబులెన్సులు ఆపడం పై హైకోర్టు ఆగ్రహం

ఇంటర్ స్టేట్ బార్డర్ నుంచి వస్తున్న అంబులెన్సులను ఎందుకు ఆపుతున్నారు అని కెసిఆర్ ప్రభుత్వం పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

 Ap And Telangana News Headlines, Breaking News, Top20 News, Roundup, Today Gold-TeluguStop.com

2.కరోనాకు ఉచిత వైద్యం అందించాలి : సీతక్క

కరోనా మహమ్మారి తో కుటుంబాలకు కుటుంబాలు నాశనం అవుతున్నాయని ఆర్థికంగా చితికి పోతున్నాయని ఎమ్మెల్యే సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం ఉచిత వైద్యం ఎందుకు  ఇవ్వడం లేదు అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

3.ఆర్మీ రాత పరీక్ష వాయిదా

Telugu Dantewada, Rajasthan, Tirumala, Gold, Top, Yeddyurappa-Latest News Englis

సైనిక నియామక ర్యాలీలో ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 30న హైదరాబాద్ లో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసినట్లు రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

4.భారత్ కు ట్విట్టర్ 110 కోట్లు సాయం

భారత్ లో కరోనా కట్టడికి సామాజిక మాధ్యమం ట్విట్టర్ తనవంతు సాయంగా 110 కోట్లు ఇస్తున్నామని ప్రకటించింది.

5.తెలంగాణ ఏపీ సరిహద్దుల్లో కొనసాగుతున్న ఆంక్షలు

Telugu Dantewada, Rajasthan, Tirumala, Gold, Top, Yeddyurappa-Latest News Englis

తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల్లో తెలంగాణ పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి.

6.తెలంగాణ కేబినెట్ భేటీ

నేడు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది.ముఖ్యంగా కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు తో పాటు లాక్ డౌన్ విధించే విషయంపైనా కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు.

7.తెలంగాణ లో కరోనా పరిస్థితి పై నేడు విచారణ

తెలంగాణలో కరోనా పరిస్థితుల పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.

8.సైబర్ సెక్యూరిటీ కోర్సులకు దరఖాస్తులు

Telugu Dantewada, Rajasthan, Tirumala, Gold, Top, Yeddyurappa-Latest News Englis

నేషనల్ అకాడమీ ఆఫ్ సెక్యూరిటీ హైదరాబాద్ సంస్థ ఆధ్వర్యంలో ఉపాధి అవకాశాలు ఉన్న సైబర్ సెక్యూరిటీ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ సంస్థ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ శ్రీ మాన్ రెడ్డి తెలిపారు.

9.30 కోట్ల విరాళం ప్రకటించిన సన్ టీవీ

కోవేట్ సంక్షోభంలో సాయం అందించే కార్యక్రమం లో భాగంగా సన్ టివి గ్రూప్ 30 కోట్లు విరాళంగా ప్రకటించింది.

10.కరోనాతో 10 మంది మావోయిస్టుల మృతి

Telugu Dantewada, Rajasthan, Tirumala, Gold, Top, Yeddyurappa-Latest News Englis

చత్తీస్ ఘడ్ లోని దంతెవాడ అడవుల్లో అజ్ఞాతంలో ఉన్న పది మందికి పైగా మావోయిస్టులు కరోనా, కలుషిత ఆహారం బారినపడి మరణించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

11.రాజస్థాన్ లో 15 రోజుల కఠిన లాక్ డౌన్

కోవేట్ కేసులు వేగంగా పెరుగుతూ ఉండడంతో రాజస్థాన్లోని అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ప్రకటించిన 15 రోజుల కఠిన లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది.

12.53 విమానాల సర్వీసులు రద్దు

Telugu Dantewada, Rajasthan, Tirumala, Gold, Top, Yeddyurappa-Latest News Englis

కర్ణాటక రాష్ట్రంలో పెరిగిపోతున్న కోవిడ్ కేసుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సంపూర్ణ లాక్ డౌన్ సోమవారం నుంచి 24 వ తేదీ అమలులో ఉండగా, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న, బెంగళూరు నుంచి వెళ్తున్న 53 విమాన సర్వీసులు రద్దయ్యాయి.

13.భారత్ లో కరోనా

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,29,942 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

14.యడ్యూరప్పకు ఢిల్లీ పిలుపు

Telugu Dantewada, Rajasthan, Tirumala, Gold, Top, Yeddyurappa-Latest News Englis

కర్ణాటకలో కరోనా విలయ తాండవం చేస్తూ ఉండడం , ప్రభుత్వం కరోనా ను కట్టడి చేయడంలో విఫలమైందనే విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్న తరుణంలో, ముఖ్యమంత్రి యడ్యూరప్ప ను ఢిల్లీకి రావాలని అధిష్టానం పెద్దలు ఆదేశించినట్లు తెలుస్తోంది.

15.కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక వాయిదా

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక మరోసారి వాయిదా పడింది.షెడ్యూల్ ప్రకారం జూన్ 23 న పార్టీ అధ్యక్షుడి ఎంపిక జరగాల్సి ఉన్న దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపద్యంలో దానిని వాయిదా వేయాలని సిడబ్ల్యుసి నిర్ణయించింది.

16.శ్రీశైలంలో కళ్యాణకట్ట తాత్కాలిక మూసివేత

Telugu Dantewada, Rajasthan, Tirumala, Gold, Top, Yeddyurappa-Latest News Englis

కరోనా ఎఫెక్ట్ తో శ్రీశైలం దేవస్థానం లోని తలనీలాలు సమర్పించే కళ్యాణ కట్ట ను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు.

17.తిరుమల సమాచారం

తిరుమలలో భక్తుల రద్దీ పూర్తిగా తగ్గిపోయింది.నిన్న 2400 మంది భక్తులు మాత్రమే స్వామివారి దర్శనం చేసుకున్నారు.

18.5 g కి కరోనా కు సంబంధం లేదు

Telugu Dantewada, Rajasthan, Tirumala, Gold, Top, Yeddyurappa-Latest News Englis

5g సాంకేతికతకు , కరోనా వ్యాప్తికి మధ్య సంబంధం లేదని టెలికాం విభాగం ( డాట్ ) సోమవారం స్పష్టం చేసింది.

19.ఏపీకి చేరిన మరో 2 లక్షల డోసులు

కోవేట్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రానికి మరో రెండు లక్షల కొవాగ్జిన్ డోసులు చేరాయి.

20.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 44,910

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 45,910.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube