జూన్ 6న ప్రారంభమైన మెటా థ్రెడ్స్ యాప్ ( Meta Threads app )మొదటి వారంలోనే 100 మిలియన్ యూజర్ బేస్ ను దాటింది.ప్రస్తుతం ట్విట్టర్ కు తనదైన శైలిలో గట్టి పోటీ ఇస్తోంది.
థ్రెడ్స్ యాప్ లో ట్విట్టర్ లో ఉన్నన్ని ఫీచర్లు లేకపోయినా ట్విట్టర్ తమ యూజర్లకు అందించలేకపోయిన కొన్ని సరికొత్త ఫీచర్లు థ్రెడ్స్ యాప్ లో ఉన్నాయి.త్వరలోనే మరిన్ని సరికొత్త ఫీచర్లను తీసుకు వస్తుందని, థ్రెడ్స్ తెలిపింది.
అయితే ప్రస్తుతం ఈ యాప్ లో ఉండే ఫీచర్లు ఏమిటో చూద్దాం.సాధారణంగా ట్విట్టర్లో ప్రస్తుతం నాలుగు ఫోటోలు, వీడియోలను మాత్రమే పోస్ట్ చేయగలం.
కానీ థ్రెడ్స్ యాప్ లో ఏకంగా 10 ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేయవచ్చు.ట్విట్టర్లో వేరే వ్యక్తి వల్ల కలత చెందితే వెంటనే ఆ వ్యక్తిని బ్లాక్ లేదా అన్ ఫాలో చేస్తారు.
కానీ థ్రెడ్స్ యాప్ లో మాత్రం ఇందుకు భిన్నంగా కంపెనీ పరిమితం చేసే ఎంపికను ఇస్తుంది.అంటే మీకు నచ్చని వ్యక్తిని వారికి తెలియకుండానే దూరంగా ఉండవచ్చు.
మీరు ఆ వ్యక్తికి సంబంధించిన ఎలాంటి అప్డేట్ ను పొందకుండా ఉండేందుకు థ్రెడ్స్ సరికొత్త ఫీచర్ ను అందుబాటులో ఉంచింది.
థ్రెడ్స్ యాప్ లో టేక్ ఎ బ్రేక్ ఆప్షన్( Take a break option ) అనే ఫీచర్ ఉంటుంది.ఈ ఫీచర్ తో మీరు యాప్ నుండి దూరం కావాల్సిన సమయాన్ని కూడా ఎంపిక చేసుకోవచ్చు.ఇలాంటి ఫీచర్ ట్విట్టర్లో లేదు.
కొన్నిసార్లు మనకు నోటిఫికేషన్లు చిరాకు తెప్పిస్తాయి.థ్రెడ్స్ లలో నోటిఫికేషన్లను కొంత సమయం పాటు ఆపడానికి కంపెనీ ఒక ఫీచర్ ను అందుబాటులో ఉంచింది.
గరిష్టంగా ఎనిమిది గంటల పాటు నోటిఫికేషన్ లను నిలిపివేయవచ్చు.ఇలాంటి ఫీచర్ ట్విట్టర్( Twitter ) లో లేదు.
థ్రెడ్స్ యాప్ ఇంస్టాగ్రామ్ కి లింక్ చేయబడి ఉంటుంది.కాబట్టి ఒకే క్లిక్ తో థ్రెడ్స్, ఇంస్టాగ్రామ్ స్టోరీలో పోస్టును షేర్ చేయవచ్చు.
ట్విట్టర్ తో పోలిస్తే థ్రెడ్స్ యాప్ లో లాగిన్ అవ్వడం చాలా సులభం.యూజర్ల అవసరాలను సులభతరం చేసేందుకు ఇలాంటి సరికొత్త ఫీచర్లు త్వరలో ఎన్నో వస్తాయని థ్రెడ్స్ తెలిపింది.