ఎక్కువ డిమాండ్ చేసినందుకే ఆ ముద్దుగుమ్మకు ఆఫర్లు రావడం లేదా?

సినామా పరిశ్రమలో కొంత మంది హీరోయిన్లు బాగా నటించి మెప్పించినా అవకాశాలు అంతగా రావు.మరికొంత మందికి మంచి అవకాశాలు వచ్చినా వాటిని నిలబెట్టుకోలేరు.

 Why Priyanka Arul Mohan Not Getting Offers , Priyanka Arul Mohan, Tollywood, Nan-TeluguStop.com

ఫలితంగా ఇండస్ట్రీ నుంచి ఫేడౌట్ అయ్యే పరిస్థితి వస్తుంది.అయినా కొందరు కాంప్రమైజ్ కాకుండా తాము అనుకున్న విషయాన్నే పట్టుకుని మొండిగా ముందుకు వెళ్తారు.

వచ్చిన పలు అవకాశాలను జారవిడుచుకుంటారు.కొంత మంది హీరోయిన్ లు బాగున్నా అవకాశాలు రావు .కానీ కొంత మందికి అవకాశాలు వచ్చినా వాటిని నిలబెట్టుకోలేరు.దాంతో వారి కెరీర్ ప్రశ్నార్థకంగా మారుతూ వుంటుంది.

అయినా సరే కాంప్రమైజ్ కాకుండా తాము అనుకున్న దానికే మొండిగా ఫిక్సవుతూ అంది వచ్చిన అవకాశాల్ని జారవిడుచుకుంటుంటారు.ప్రస్తుతం ఇదే పరిస్థితిని ఎదుర్కుంటోంది ప్రియాంక అరుళ్ మోహన్.

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన చిత్రం నానీస్ గ్యాంగ్ లీడర్ ద్వారా ఈ ముద్దుగుమ్మ జనాలకు పరిచయం అయ్యింది.తొలి సినిమాతోనే మంచి గుర్తింపు అందుకుంది.

ఆ తర్వాత శర్వానంద్ తో కలిసి శ్రీకారం అనే సినిమా చేసింది.ఈ సినిమా కూడా ఫర్వాలేదు అనిపించింది.

ఆ తర్వాత ఈ అమ్మడు మళ్లీ కనిపించలేదు.చక్కటి అందం.

అందకు మించిన నటన తన సొంతం అయినా.టాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు రావడం లేదు.

అయితే ఆమె తీసుకున్న నిర్ణయాలే ఇందుకు కారణం అనే మాట వినిపిస్తోంది.రెమ్యునరేషన్ విషయంలో వెనక్కి తగ్గకపోవడం మూలంగానే తెలుగునాట తనకు ఆఫర్లు రావడం లేదనే టాక్ వినిపిస్తోంది.

కెరీర్ మొదలు పెట్టి కొద్ది రోజులే అయినా.ఒక్కో సినిమాకు రూ.75 లక్షలు అడుగుతుందట.దీంతో ఆమెకు ఆఫర్లు ఇచ్చేందుకు నిర్మాతలు ముందుకు రావడం లేదట.ఈ అమ్మడు ప్రస్తుతం తమిళంలో సూర్యతో సినిమా చేస్తుంది.ఎంతార్కుమ్తున్నధావన్ అనే మూవీలో ఈ అమ్మడు ఆడిపాడుతోంది.ఈ సినిమాకు పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు.యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో మార్చి 10న రిలీజ్ చేస్తున్నారు.

Why Priyanka Arul Mohan Not Getting Offers , Priyanka Arul Mohan, Tollywood, Nani , Gang Leader, Sharwanand - Telugu Gang, Nani, Priyankaarul, Sharwanand, Tollywood

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube