తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరోలు దర్శకులు చాలామంది ఉన్నారు.అలాగే తమిళ్ సినిమా ( Tamil movie )ఇండస్ట్రీలో కూడా తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో శంకర్ మొదటి స్థానంలో ఉంటాడు.
ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు ఆయనను చాలా ప్రత్యేకంగా చూపిస్తూ ఉంటాయి.అందువల్లే ఆయన సినిమాల్ని ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తుంటారు.
అలాంటి క్రమంలో ఆయన చేస్తున్న వరుస సినిమాలు సూపర్ అవ్వాలని మరి కొంతమంది అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.ఇక ఇప్పుడు ఆయన భారతీయుడు 2( Bharatiyadudu 2 ) సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఇక అప్పుడెప్పుడో వచ్చిన భారతీయుడు సినిమా సూపర్ సక్సెస్ అయిన విషయం మనకు తెలిసిందే.ఇక దానికోసమే ఆ సినిమాకి సీక్వెల్ ని ఇప్పుడు ప్లాన్ చేసి చేస్తున్నారు.మరి ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని అందుకుంటాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఇద్దరు కమలహాసన్( Kamala Haasan ) లు ఉంటారా లేదంటే ఒక్కరే ఉంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఎందుకంటే కమలహాసన్ ట్రైలర్ లో చూపించినంత సేపు ముసలి క్యారెక్టర్ లోనే కనిపించాడు.మరి మిడిల్ ఏజ్ క్యారెక్టర్ లో కూడా కనిపించే అవకాశాలు ఉన్నాయా అంటూ అభిమానులు వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
ఇక ఇప్పటికే కమలహాసన్ తో పాటు ఈ సినిమాలో సూర్య( Surya ) కూడా కీలకపాత్ర పోషిస్తున్నాడు.అయితే కమలహాసన్ కొడుకు పాత్రలో ఒక కనిపించబోతున్నాడనే వార్తలైతే ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి… చూడాలి మరి ఈ సినిమాలో ఇద్దరు కమకాహసన్లు కనిపిస్తారా లేదంటే ఒక కమలహాసన్ తోనే సినిమా నడుస్తుందా అనేది.ఇక ఈ సినిమా జులై 12 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది…
.