షాకింగ్ వీడియో : ఇదేంటి భయ్యా.. ఎయిర్‌పోర్ట్‌లో పీతల సైన్యం..

సాధారణంగా మనం ఎక్కడికైనా వెళ్లే సమయంలో ఫ్లైట్ లో( Flight ) ప్రయాణించాలి అంటే విమానాశ్రయం వద్ద పలు చెకింగ్ చేస్తూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం.అయితే ఇలాంటి చెకింగ్ చేసే సమయంలో చాలా వరకు గోల్డ్ స్మగ్లింగ్, వెండి స్మగ్లింగ్, డ్రగ్స్ స్మగ్లింగ్ ఇతర వస్తువులను రహస్యంగా తీసుకొని వెళ్లడం మనం చూస్తూనే ఉంటాం.

 Crabs Invade Airport Baggage Claim Shocking Travelers Video Viral Details, Crabs-TeluguStop.com

ఇక కొన్ని సందర్భాలలో ఏకంగా పాములు, తేళ్ల వంటివి కూడా బ్యాగులల్లో పెట్టుకొని ప్రయాణించడం మనం తరచూ చూస్తూనే ఉన్నాం.అందుకు సంబంధించి అనేక వీడియోలు వైరల్ గా మారాయి కూడా.

ఇది ఇలా ఉండగా.తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా.ఒక విమానాశ్రయంలో పీతల సైన్యం దాడి చేసినట్లు కనపడుతుంది.ఈ పీతలు( Crabs ) బహుశా ప్రయాణికుల బ్యాగు నుంచి బయటకు వచ్చి విమానాశ్రయంలోని లగేజ్ కన్వేయర్ బెల్ట్‌ పై( Luggage Conveyor Belt ) చక్కర్లు కొడుతుండడం మనం గమనించవచ్చు.

ఒక్కసారిగా కన్వేయర్ బెల్ట్‌ పై భారీ సంఖ్యలో పీతలు రావడంతో అక్కడ ఉన్న పాసెంజర్స్ అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు.వాటిలో చాలా వరకు పీతలు సజీవంగా ఉన్నట్లు ఆ కన్వేయర్ బెల్ట్‌ మీద ప్రయాణిస్తూ ముందుకు వెళ్తూ.

ఇంకా అక్కడికి ఇక్కడికి పాకుతూ ఉండడం మనం చూడవచ్చు.

ఇక ప్రయాణికులు చాలామంది లగేజ్ ను కన్వేయర్ బెల్ట్‌నుంచే దింపడంలో ఇబ్బందులు పడుతుండగా.మరికొందరు వారి లగేజీలను చెక్ చేసుకుని దింపుకునే పనిలో మునిగిపోయారు.ఇక మరోవైపు ఈ కాన్వెర్ బెల్ట్ పై నుంచి ఉన్న పీతలను అక్కడి నుంచి బయటకు పంపేందుకు ఏ ఒక్క ఎయిర్పోర్ట్ ఉద్యోగి( Airport Staff ) కూడా సమీపంలో కనిపించకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

ఇక ఈ వీడియోను చూసిన కొంతమంది నెటిజన్స్ అసలు ఈ పీతలు ఎక్కడి నుంచి వచ్చాయి.లేదా తమ వస్తువులు ఎక్కడ ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాయా అంటూ.

ఫన్నీ కామెంట్ చేస్తున్నారు.మరికొందరైతే ఎవరో స్మగ్లింగ్ చేస్తున్నారని ముందు అతని కస్టమ్స్ అధికారులకు పట్టించండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube