కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంత మంచి సక్సెస్ అందుకున్న శరత్ కుమార్ ( Sharath Kumar ) వారసురాలిగా వరలక్ష్మి( Varalakshmi ) ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.ఇక ఈమె కెరియర్ మొదట్లో హీరోయిన్ గా నటించారు.
కానీ సక్సెస్ కాకపోవడంతో నెగిటివ్ పాత్రలలో నటించారు.ఇలా విలన్ పాత్రలలో వరలక్ష్మి శరత్ కుమార్ ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకున్నారు.
ప్రస్తుతం తెలుగు తమిళ భాష చిత్రాలలో నటించడమే కాకుండా లేడి ఓరియెంటెడ్ సినిమాలలో కూడా నటిస్తూ ఈమె కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంత బిజీగా ఉన్నా వరలక్ష్మి శరత్ కుమార్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే.ఈమె నికోలయ్ సచ్ దేవ్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు.ఇక జూలై నెలలో ఈమె వివాహం జరగబోతున్న నేపథ్యంలో ఇప్పటికే కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో మాత్రమే కాకుండా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఉన్న సెలబ్రిటీలు అందరిని కూడా తన పెళ్లికి ఆహ్వానించారు.
ఇలా తన కాబోయే భర్తతో కలిసి ప్రతి ఒక్కరిని ఎంతో మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు.

ఇకపోతే తాజాగా వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి( Narendra Modi ) కూడా పెళ్లి ఆహ్వాన పత్రికను అందజేశారు.తన తండ్రి శరత్ కుమార్ తో పాటు సినీనటి రాధిక( Radhika ) తో కలిసి ఈమె ప్రధానమంత్రిని కలిశారు.ఇక రాధిక ఇటీవల జరిగిన ఎన్నికలలో భాగంగా బిజెపి ఎంపిగా ఎన్నికలలో పోటీ చేసిన సంగతి మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే మోదీ అపాయింట్మెంట్ తీసుకున్నటువంటి రాధిక తన భర్తతో పాటు వరలక్ష్మి ఆమెకు కాబోయే భర్తతో కలిసి నరేంద్ర మోడీకి వివాహ ఆహ్వాన పత్రికను అందజేసి పెళ్లికి రావాలని కోరారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.