కేంద్రంలో బిజెపి( BJP ) మూడోసారి అధికారంలోకి వచ్చింది.సరైన మెజారిటీ రాకపోవడంతో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కలిసి ప్రభుత్వన్ని ఏర్పాటు చేశారు.
ముఖ్యంగా టిడిపి ఎన్ డి ఏ కూటమిలో కీలక భాగస్వామిగా మారడంతో, ఆ పార్టీకి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు బిజెపి అగ్ర నేతలు.ఇప్పటికే శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడుకి ( MP Kinjarapu Rammohan Naidu )కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా క్యాబినెట్ హోదా కలిగిన మంత్రి పదవిని ఇవ్వగా, మరో టిడిపి ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ ( TDP MP Pemmasani Chandrasekhar )కు సహాయం మంత్రి ఇచ్చారు.
ఇప్పటికే స్పీకర్ ఎన్నిక పూర్తయింది .స్పీకర్ గా ఓం బిర్లా ఎన్నికయ్యారు.డిప్యూటీ స్పీకర్ పదవి ఎవరికి దక్కబోతోందనేది అందరికీ ఆసక్తికరంగా మారింది.
ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న టిడిపికే డిప్యూటీ స్పీకర్ పదవిని కేటాయించాలని బిజెపి అగ్ర నేతలు నిర్ణయించుకోవడంతో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక చంద్రబాబు చేతుల్లోకి వచ్చింది.టిడిపి ఎంపీలలో ఎవరికి చంద్రబాబు అవకాశం ఇస్తారనేది తేలాల్సి ఉంది.వాస్తవంగా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం( NDA Govt ) స్పీకర్ పదవిని టిడిపికి కేటాయిస్తుందని ముందుగా అంచనా వేసినా, అది సాధ్యం కాలేదు.
రాజమండ్రి బిజెపి ఎంపీ పురందరేశ్వరి పేరు తెరపైకి వచ్చినా ఆమెను పరిగణలోకి తీసుకోకుండా , ఓం బిర్లా వైపు మొగ్గు చూపించారు .ఇప్పుడు టిడిపికి లోక్ డిప్యూటీ స్పీకర్ ను కేటాయించబోతూ ఉండడం తో చంద్రబాబు ఈ విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నారు.
టిడిపికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తే అది అమలాపురం టిడిపి ఎంపీ గంటి హరీష్ ( TDP MP Ganti Harish )పేరునే చంద్రబాబు పరిగణలోకి తీసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత ఎన్డీయే ప్రభుత్వంలో వాజ్ పాయ్ ప్రధానిగా ఉండగా, స్పీకర్ గా జిఎంసి బాలయోగి ఉండేవారు.ఇప్పుడు బాలయోగి కుమారుడు హరీష్ పేరును పరిగణలోకి తీసుకుంటున్నట్లు సమాచారం.హరీష్ పేరును చంద్రబాబు ప్రతిపాదించినా దీనిపై ప్రధాని నరేంద్ర మోది ఫైనల్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.