పోలవరం కోసం విదేశీ నిపుణులు రప్పిస్తున్నాం సీఎం చంద్రబాబు కీలక ప్రకటన..!!

ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu ) శుక్రవారం అమరావతిలో పోలవరంపై సమీక్ష నిర్వహించారు.ఈ క్రమంలో ప్రాజెక్టు పనులు ఎంతవరకు పనులు జరిగాయి అన్నదానిపై శ్వేత పత్రం విడుదల చేయబోతున్నట్లు ప్రకటన చేయడం జరిగింది.

 Foreign Experts Are Being Brought For Polavaram Cm Chandrababu Key Announcement-TeluguStop.com

ఈ క్రమంలో నీటిపారుదల రంగానికి సంబంధించి తమ ప్రభుత్వం చేసే ప్రతి పనికి సంబంధించి డాక్యుమెంట్లు వెబ్ సైట్ లో పెడతామని పేర్కొన్నారు.తాము విడుదల చేయబోయే శ్వేతపత్రం రెండు భాగాలుగా ఉంటుందని అన్నారు.

ఒకటి పోలవరం ప్రాజెక్టుకి( Polavaram project ) సంబంధించి మరొకటి సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిందని తెలిపారు.రాష్ట్రానికి సాగునీటి ప్రాజెక్టుల అవసరం ఎంతో ఉంది.

2014 నుంచి 2019 వరకు సాగునీటి ప్రాజెక్టులపై 67 వేల కోట్లు ఖర్చు పెట్టాం.ఇప్పుడైతే వాటి నిర్వహణ ఖర్చులు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది.పోలవరం ప్రాజెక్టు కట్టడం కంటే మరమ్మత్తు ఇంకా కష్టమైన పనిగా మారిందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.తాము పడిన శ్రమను జగన్( Jagan ) వృధా చేశారని విమర్శించారు.

కాగా ప్రాజెక్టుల మరమ్మత్తుల కోసం అమెరికా, కెనడా నుంచి నిపుణులు రప్పిస్తున్నట్లు వెల్లడించారు.వాళ్లు ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు.

పోలవరం ఎంత కాలంలో బాగు చేయవచ్చు అనేది నిపుణులు తేలుస్తారు.ఇటీవల పోలవరం ప్రాజెక్టు చూసినప్పుడు కళ్ళు వెంట నీళ్లు వచ్చాయని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube