ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu ) మాజీ సీఎం వైఎస్ జగన్ భద్రతపై శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు.రాజకీయాల్లో ఉండటానికి అర్హత లేని వ్యక్తి జగన్ అంటూ మండిపడ్డారు.
జగన్ చేసిన ఘోరాలు రాష్ట్రాన్ని వెంటాడుతున్నాయి.ఇది ఎన్నేళ్లు అనేది కాలమే నిర్ణయించాలి.
జగన్( Jagan ) కు 986 మంది పోలీసులతో భద్రత ఉండేది.అసలు ముఖ్యమంత్రికి అంత భద్రత అవసరమా.? ఇప్పుడు నేను కూడా వెళ్తుంటే అధికారులు పరదాలు కట్టేస్తున్నారు.ఇవన్నీ వద్దని చెప్పా.
ఆలస్యమైన పర్వాలేదు ట్రాఫిక్ ఆపొద్దని స్పష్టం చేశా.అంటూ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.
శుక్రవారం పోలవరం ప్రాజెక్టుపై( Polavaram project ) శ్వేత పత్రం విడుదల చేశారు.
అమరావతిలో జరిగిన ఈ కార్యక్రమంలో.మొన్నటివరకు తమకున్న సమాచారం ప్రకారం రాజకీయ ఆరోపణలు చేయడం జరిగింది.ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చాక అసలు వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలిసే ప్రయత్నం చేస్తామని వెల్లడించారు.
పోలవరం పై ముందుకు వెళ్లేందుకు మేధావులు మరియు నిపుణులు మీడియా వివిధ వర్గాల ప్రజల నుంచి సూచనలు సలహాలు స్వీకరిస్తామని స్పష్టం చేశారు.ఎన్నికల్లో గెలిచిన తర్వాత రాష్ట్రాన్ని నిలబెట్టడంలో ప్రజలు కూడా సహకరించాలి.
అందుకే ఏడు అంశాలపై శ్వేత పత్రాలు విడుదల చేస్తున్నాం.వీటిని 25 రోజుల వ్యవధిలో తీసుకువస్తాం.
అన్నింటి పై చర్చలు పూర్తిచేసుకుని అసెంబ్లీ సమావేశాలకు వెళతాం.బడ్జెట్ కూడా ప్రవేశ పెట్టాల్సిన అవసరం ఉంది.
అటు లోక్ సభ సమావేశాలు ఆయా అంశాలకు సంబంధించి నిధులు సాధించుకోవాల్సిన అవసరం ఉంది.రాష్ట్రానికి రెండు ప్రధానమైన ప్రాజెక్టులు ఒకటి అమరావతి, రెండు పోలవరం.
రెండు కూడా రెండు కళ్ళు వంటివి.ఈ రెండు పూర్తి చేసుకుంటే విభజన నష్టాల నుండి బయటపడే అవకాశం ఉంటుంది.
అంటూ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.