బొప్పాయితో ఈ సింపుల్ చిట్కాను పాటిస్తే మీ ముఖంపై ఒక్క మచ్చ కూడా ఉండదు!

బొప్పాయి( Papaya ) రుచికరమైన పండు మాత్రమే కాదు మన ఆరోగ్యానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలను కూడా కలిగి ఉంటుంది.నిత్యం ఒక కప్పు బొప్పాయి పండు ముక్కలు తినడం వల్ల వివిధ రోగాలకు దూరంగా ఉండవచ్చని నిపుణులు చెప్తుంటారు.

 Try This Papaya Mask For Spotless And Beautiful Skin Details, Papaya Mask, Spot-TeluguStop.com

ఇది అక్షరాల సత్యం.అయితే ఆరోగ్యాన్నే కాదు అందాన్ని పెంచే సత్తా కూడా బొప్పాయికి ఉంది.

ముఖ్యంగా మ‌చ్చ‌లేని మెరిసే చర్మాన్ని( Spotless Skin ) అందించడానికి బొప్పాయి తోడ్పడుతుంది.అందుకోసం బొప్పాయి పండును ఎలా ఉపయోగించాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Beautiful Skin, Tips, Latest, Papaya, Papaya Benefits, Papaya Face, Skin

ముందుగా మిక్సీ జార్ లో తొక్క తొలగించిన బొప్పాయి పండు ముక్కలు వేసి ప్యూరీ మాదిరి గ్రైండ్ చేసుకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఓట్స్ పౌడర్( Oats Powder ) వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ ముల్తాని మట్టి,( Multani Mitti ) పావు టీ స్పూన్ ఆర్గానిక్ పసుపు, వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ మరియు సరిపడా బొప్పాయి పండు ప్యూరీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.

Telugu Beautiful Skin, Tips, Latest, Papaya, Papaya Benefits, Papaya Face, Skin

ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు కూడా అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై కూల్ వాటర్ తో ఫేస్ ను శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.బొప్పాయితో రెండు రోజులకు ఒకసారి ఈ సింపుల్ చిట్కాను కనుక పాటిస్తే మీ ముఖంపై ఒక్క మచ్చ కూడా ఉండదు.ఈ బొప్పాయి మాస్క్ చర్మంపై మచ్చలను క్రమంగా మాయం చేస్తుంది.

డార్క్ ప్యాచెస్ ను తొలగిస్తుంది.స్కిన్ టోన్ ను మెరుగుపరుస్తుంది.

క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం చేస్తుంది.

అలాగే బొప్పాయిలో విటమిన్ ఎ మరియు ఇ ఉంటాయి.

ఇది మీ చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడుతాయి.బొప్పాయిలో ఉండే పపైన్ మరియు చైమోపాపైన్ వంటి ఎంజైమ్‌లు చర్మ రంధ్రాల్లో పేరుకుపోయిన మురికి మృత కణాలను తొలగిస్తాయి.

మొటిమల సమస్యకు అడ్డుకట్ట వేస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube