తెల్ల జుట్టుకు చెక్ పెట్టే సూపర్ ఎఫెక్టివ్ రెమెడీ మీ కోసం!

ఇటీవల రోజుల్లో చాలా మంది చిన్న వయసులోనే తెల్ల జుట్టు( White Hair ) సమస్యను ఫేస్ చేస్తున్నారు.తక్కువ వయసులోనే జుట్టు తెల్లగా మారడానికి అనేక కారణాలు ఉన్నాయి.

 A Super Effective Remedy To Check White Hair Is For You Details, White Hair, Bl-TeluguStop.com

ప్రధానంగా ఒత్తిడి, కాలుష్యం, రసాయనాలతో కూడిన కేశ ఉత్పత్తులను వాడటం వంటి అంశాలు జుట్టు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి.అలాగే కొందరికి జీన్స్ పరంగా కూడా చిన్న వయసులోనే తెల్ల జుట్టు వస్తుంటుంది.

అయితే తలలో తెల్ల వెంట్రుకలు కనపడగానే వర్రీ అయిపోతుంటారు.కానీ టెన్షన్ పక్కనపెట్టి కొన్ని ఇంటి చుట్కాలను పాటిస్తే ఆదిలోనే సమస్యకు చెక్‌ పెట్టవచ్చు.

ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ వైట్ హెయిర్ సమస్యను దూరం చేయడానికి సూపర్ ఎఫెక్టివ్ గా సహాయపడుతుంది.అందుకోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో నాలుగు మందారం పువ్వులు,( Hibiscus Flowers ) మూడు మందారం ఆకులు, అర కప్పు ఫ్రెష్ కలబంద జెల్( Aloevera Gel ) మరియు నాలుగు టేబుల్ స్పూన్లు బియ్యం నానబెట్టిన వాటర్( Rice Water ) వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

Telugu Aloevera Gel, Black, Care, Care Tips, Pack, Healthy, Henna Powder, Remedy

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్లు హెన్నా పౌడర్, వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి.ఆపై తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

Telugu Aloevera Gel, Black, Care, Care Tips, Pack, Healthy, Henna Powder, Remedy

గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒకసారి ఈ హెయిర్ ప్యాక్ ను వేసుకోవడం అలవాటు చేసుకుంటే మస్తు బెనిఫిట్స్ లభిస్తాయి.ముఖ్యంగా ఈ ప్యాక్ వైట్ హెయిర్ కు చెక్ పెడుతుంది.జుట్టులో మెలనిన్ ఉత్పత్తిని పెంచుతుంది.తెల్ల జుట్టును మళ్లీ నల్లగా మారుస్తుంది.అలాగే ఈ ప్యాక్ ను వేసుకోవడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.

చుండ్రు పోతుంది.కురులు దృఢంగా ఆరోగ్యంగా సైతం మారతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube