ఎంతో కాలం సినిమా రంగంలో కొనసాగి మంచి పేరు సంపాదించుకున్న తరుణ్.అన్నే వివాదాలు, గొడవలతో కెరీర్ కు స్వస్తి పలికాడు.
బాల నటుడిగా సినిమాల్లోకి అడుగు పెట్టిన ఆయన.మంచి నటనతో ఆ తర్వాత హీరోగా మారాడు.వరుస విజయాలు అందుకుని స్టార్ హీరోగా అయ్యాడు.20 ఏండ్ల పాటు తన స్టార్ డమ్ కొనసాగించాడు.అప్పుడప్పపుడు కొన్ని వివాదాలు, పరాజయాలతో కెరీర్ కు దూరం అయ్యాడు.తాజాగా కొడుకు జీవితం గురించి ఆయన తల్లి, సీనియర్ నటి రోజారమణి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
అలనాటి నటీనటులు రోజా రమణి, చక్రపాణి కొడుకు తరుణ్.వాళ్లిద్దరి సహకారంతో మనసు మమత అనే సినిమా ద్వారా బల నటుడిగా సినిమాల్లోకి వచ్చాడు.తన నటనతో తొలి సినిమాకే నంది అవార్డు అందుకున్నాడు.సుమారు 5 సంవత్సరాల పాటు చైల్డ్ ఆర్టిస్టుగా ముందుకుసాగాడు.అన్ని సినిమాల్లోనూ మంచి నటన చూపించాడు.ఆ తర్వాత నువ్వే కావాలి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.
ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది.ఆ తర్వాత నువ్వులేక నేనులేను, ప్రియమైన నీకు, నువ్వే నువ్వే సహా పలు సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేశాడు.
స్టార్ హీరోగా మారాడు.చాలా తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సంపాదించాడు.
వరుసగా లవ్ సినిమాలు చేసి లవర్ బాయ్ గా మారాడు.

కెరీర్ లో మంచి పేరు సంపాదించుకున్న తరుణ్ అంతే స్థాయిలో వివాదాలకు కారణం అయ్యాడు.అప్పట్లో హీరోయిన్ తో లవ్.ఆత్మహత్యయత్నం పెద్దతల నొప్పులను తెచ్చింది.ఆ తర్వాత డ్రగ్స్ కేసులో చిక్కుకున్నాడు.మరోవైపు వరుసస పరాజయాలతో కెరీర్ కు పుల్ స్టాప్ పడింది.తాజాగా అనుకోని అతిథి సినిమాకు డబ్బింగ్ చెప్పాడు.తాజాగా తన తల్లిదండ్రులు ఓ షోలో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.
స్విట్జర్లాండ్ లో పోలీసులులతో ఎదురైన అనుభవాన్ని వివరించారు.తరుణ్ కు భక్తి ఎక్కువ కావడంతో.
ఎక్కడకు వెళ్లినా అగర్ బత్తిలు, కర్పూరం తీసుకెళ్లే వారట.ఓసారి స్విట్జర్లాండ్ కు వెళ్లినప్పుడు.
హోటల్లో తరుణ్ అగర్ బత్తిలు వెలిగించి పూజ చేస్తుండగా పొగ వచ్చి ఫైర్ అలారమ్ మోగిందట.వెంటనే పోలీసులు వచ్చిన నానా యాగీ చేశారని చెప్పింది.