Rama Idols : కృష్ణా నదిలో ప్రత్యక్షమైన రాముడు విగ్రహాలు..! అసలు కారణం ఏమిటి..?

సాధారణంగా హిందువులకు పురాతన దేవతామూర్తులు విగ్రహాలు అంటే చాలా మక్కువ.అలాంటి విగ్రహాలు ఇటీవల తెలుగు రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన కృష్ణానదిలో( Krishna River ) ఎన్నోసార్లు బయటపడ్డాయి.

 What Is The Real Reason For The Idols Of Lord Rama Appearing In The Krishna Riv-TeluguStop.com

ఈ విగ్రహాలను వేటకు వెళ్ళిన మత్స్యకారులకు దొరకడం, వారు వాటిని బయట తీసుకురావడం జరుగుతుంది.ఇప్పటికే పలుసార్లు నాగదేవత విగ్రహాలు, శివలింగం, విష్ణుమూర్తి, నంది( Nagadevata, Shivlingam, Vishnumurthy, Nandi ) ఇలా సుమారు 11 రకాల రాతి విగ్రహాలను గుర్తించడం జరిగింది.

వీటిని చూడటానికి ప్రజలు తండోపతండాలుగా కూడా తరలివచ్చేవారు.ఇలాంటి సంఘటనే తెలంగాణ, కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న కృష్ణా నదిలో కూడా జరిగింది.

Telugu Krishna River, Nagadevata, Nandi, Rama Idols, Shivlingam, Shri Mahavishnu

అక్కడ వంతెన పనులు జరుగుతున్న సమయంలో సాక్షాత్తు ఆ దేవత మూర్తి విగ్రహం బయటపడడం జరిగింది.తెలంగాణ, కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న కృష్ణా నదికి సంబంధించి వంతెన నిర్మాణ పనులు జరుగుతున్నాయి.అయితే ఆ సమయంలోనే మంగళవారం వంతెన పనులు చేస్తుండగా నదిలో కొన్ని విగ్రహాలు దర్శనమిచ్చాయి.వాటిని అలా తవ్వుతుండగా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ( Shri Mahavishnu )నిలువెత్తు విగ్రహం, ఒక శివలింగం దర్శనం ఇచ్చింది.

దీనిని అధికారుల ఆదేశాలతో అత్యంత జాగ్రత్తగా తవ్వకాలు చేపట్టి, విగ్రహాలకు ఎలాంటి దెబ్బతినకుండా బయటకు తీయడం జరిగింది.అయితే వాటిలో శ్రీమహావిష్ణువు విగ్రహం పరిశీలించగా అది ఇటీవలే అయోధ్య రామాలయంలో ప్రతిష్టించిన రామ్ లల్ల విగ్రహం( Ram Lalla statue ) లాగే ఉంది.

Telugu Krishna River, Nagadevata, Nandi, Rama Idols, Shivlingam, Shri Mahavishnu

ఆ విగ్రహాలు శతాబ్దాల చరిత్ర చెందినవిగా కూడా కనిపిస్తున్నాయి.ముఖ్యంగా శ్రీ మహావిష్ణువుని చూస్తే నాలుగు చేతులతో నిలబడిన ఆకారంలో కనిపించింది పై చేతుల్లో శంకు చక్రాలు, మరో రెండు చేతుల్లో కటి హస్తా, వరద హస్త కూడా ఉన్నాయి.ఇక విష్ణువు చుట్టూ మత్స్య, కుర్మా, వరాహ, నరసింహ, వామన, రాముడు, పరశురాముడు, కృష్ణుడు, బుద్ధుడు, కల్కి లాంటి దశావతారాలు కూడా కలిగి ఉన్నాయి.ఆ విగ్రహానికి పూలమాలలు కూడా ఉండడం విశేషమని చెప్పవచ్చు.

దీంతో ఈ వార్త ఒక్కసారిగా దేశవ్యాప్తంగా వ్యాపించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube