మన దేశంలో చాలా మంది ప్రజలు జ్యోతిష్య శాస్త్రాన్ని( Astrology ) బలంగా నమ్ముతారు.వారి జీవితంలో ఏ చిన్న విషయం జరిగిన అది జ్యోతిష్యం ప్రకారమే జరిగిందని నమ్మేవారు కూడా ఉన్నారు.
అయితే మన రాశులను బట్టి గ్రహాల ప్రభావం కూడా ఉంటుందని పండితులు చెబుతున్నారు.ఈ ప్రభావం వల్ల కొన్ని రాశులకు మంచి ఫలితాలు దక్కితే, మరి కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు కలుగుతాయి.
ఇంకా చెప్పాలంటే పురాణాల ప్రకారం సూర్యుడు, శని దేవుళ్లను తండ్రీకొడుకులుగా చెబుతూ ఉంటారు.

జూన్ లో ఈ రెండు గ్రహాలు ఒకే సమయంలో సంచారం చేయనున్నారు.జూన్ 15 న రాత్రి 11:58 నిమిషంలో నుంచి సూర్యుడు మిధున రాశిలోకి ప్రవేశిస్తాడు.అలాగే జూన్ 17న శని సొంత రాశి కుంభరాశిలోకి తిరిగి వస్తాడు.
దీనివల్ల ఈ రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి.ఆ రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా చెప్పాలంటే సూర్యుడు, శని సంచారం సమయంలో సింహరాశి( Simha Rasi ) వారు శుభ ఫలితాలను పొందుతారు.వీరికి ఆకస్మిక ధన లాభం కలుగుతుంది.
శుభకార్యాలకు ఎక్కువ ధనం ఖర్చు చేయవచ్చు.మీ జీవితం ప్రశాంతంగా గడిచిపోతుంది.

అలాగే కన్య రాశి( Kanya Rasi ) వారు తమ వ్యాపారాన్ని విస్తరించుకునే అవకాశం కూడా ఉంది.సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.వృత్తి రంగాల్లో వారికి మంచి పురోగతి లభిస్తుంది.వీరి కష్టాలు దూరమైపోతాయి.మకర రాశి వారు ఈ సమయంలో ఉద్యోగంలో ప్రమోషన్ పొందే అవకాశాలు ఉన్నాయి.మీరు ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు.
ప్రభుత్వ ఉద్యోగాల కోసం పరీక్షలు రాసే వారికి మంచి ప్రయోజనం ఉంటుంది.
అలాగే మిధున రాశి వారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది.
ఉద్యోగంలో ప్రమోషన్ కూడా రావచ్చు.కొత్త పనులను ప్రారంభించే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.
ఈ సమయంలో మీరు శుభ ఫలితాలను పొందవచ్చు.మీ జీవిత భాగ్యస్వామితో మంచి అనుబంధం ఉంటుంది.