ఈ మధ్య కాలంలో కొందరు విద్యార్థులు తమ ప్రతిభతో చిన్న వయస్సులోనే అరుదైన రికార్డులను సొంతం చేసుకుంటూ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ( American space agency ) అయిన నాసా( NASA ) నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రాంకు ఏపీకి చెందిన కుంచాల కైవల్యారెడ్డి ఎంపికయ్యారు.15 సంవత్సరాలకే కైవల్యారెడ్డి అరుదైన రికార్డ్ ను ఖాతాలో వేసుకోవడం గమనార్హం.
తూర్పు గోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన ఈ విద్యార్థిని తన ప్రతిభతో నాసా స్పేస్ ప్రోగ్రాంకు ఎంపిక కావడంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
నాసా భాగస్వామ్య సంస్థ అయిన ఏఈఎక్స్ఏ 15 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న 50 నుంచి 60 మంది విద్యార్థులను నాసా స్పేస్ ప్రోగ్రామ్ కు ఎంపిక చేయడం జరిగింది.ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో కైవల్య( Kaivalya ) సత్తా చాటారు.
బాల్యం నుంచి ఖగోళ శాస్త్రంపై కైవల్యకు ప్రత్యేక ఆసక్తి ఉండేది.చిన్న వయస్సులోనే అంతర్జాతీయ ఎయిర్ అండ్ స్పెస్ ప్రోగ్రామ్ కు ఎంపికైన భారతీయ విద్యార్థినిగా కైవల్య రికార్డ్ సృష్టించారు.గతంలో ఏపీకి చెందిన బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న దంగేటి జాహ్నవి( Dangeti Jahnavi ) సైతం ఈ శిక్షణకు ఎంపిక కావడం గమనార్హం.కైవల్య గతంలో కూడా పలు అరుదైన ఘనతలను ఖాతాలో వేసుకోవడం జరిగింది.
ఇంటర్నేషనల్ ఆస్టరాయిడ్ సెర్చ్ కొలాబరేషన్ నుండి మెయిన్ బెల్ట్ ఆస్టరాయిడ్ సీఎం 37ను గుర్తించినందుకు ఆమె గతంలో సర్టిఫికెట్ ను పొందారు.కైవల్య పాన్ స్టార్స్ టెలీస్కోప్ ద్వారా కైవల్య క్లిక్ చేసిన ఛాయాచిత్రాలను విశ్లేషించడం జరిగింది.కైవల్య గతంలో సీఎం జగన్ చేతుల మీదుగా లక్ష రూపాయల రివార్డ్ ను పొందారు.కైవల్య భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగడంతో పాటు కెరీర్ పరంగా ఎన్నో సంచలనాలు సృష్టిస్తారని నెటిజన్లు సోషల్ మీడియాలో చెబుతున్నారు.