కులం పేరుతో మతం పేరుతో మనుషులు కొట్టుకుచస్తున్న రోజులు ఇవి.కులం, మతం పేరు చెప్పి స్వార్థ రాజకీయాలు నడుపుతున్న రోజులు ఇవి.
కులం, మతం పేరుతో పబ్బం గడుపుకుంటున్న రోజులు ఇవి.అలాంటి ఈ రోజుల్లోనూ అక్కడక్కడ మత సామరస్యం వెల్లివిరుస్తోంది.అలాంటి సంఘటన ఒకటే ఈజిప్టు లో చోటు చేసుకుంది.
ఈజిప్టు లో మతసామరస్యం విల్లివిరిసింది.
క్రైస్తవ మతానికి సంబంధించిన కొందరు మత పెద్దలు జాతీయ ఐక్యతను చాటుకునేందుకు గత 50 సంవత్సరాలుగా ప్రతీ ఏటా ముస్లింలకు ఇఫ్తార్ భోజనాలను ఏర్పాటు చేస్తున్నారు.ఇక్కడ మతంతో సంబంధం లేకుండా పలువురు పాల్గొంటారు.
అయితే.ప్రతీ ఏడాదిలానే ఈ ఏడాది కూడా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కి ఎక్కింది.
రంజాన్ నెలలో రోజంతా ఉపవాస దీక్ష చేసిన ముస్లింలు సాయంత్రం ఇఫ్తార్ విందు ఆరగిస్తారు.దీనిలో పోషక విలువలు అధికంగా ఉండే హలీం తప్పనిసరిగా తీసుకుంటారు.
దీనివల్ల నీరసించిన శరీరానికి వెంటనే శక్తి వస్తుందని చెబుతారు.

ఈ విందులో ఎన్నో రకాల పదార్థాలు ఉంటాయి.వాటిని స్నేహంగా ఒకరికొకరు తినిపించుకుంటారు.ఇక్కడ ధనిక, పేద.కులం, మతం అనేవి ఎక్కడా కనపడవు.ప్రస్తుతం ఈ ఇఫ్తార్ విందుకు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఆ ఫొటోలో దాదాపు వీధి పొడవునా విందు కోసం ఏర్పాటు చేసిన కుర్చీలు, బల్లలు కనిపిస్తున్నాయి.దీన్ని చూసిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఇక్కడ జరిగే ఇఫ్తార్ విందు మత సామరస్యానికి ప్రతీక అని, పండుగలు అన్నీ కలిసే చేసుకుంటామని ముస్లింలు చెప్పారు.