బురద జాతరకు సంబంధించిన విశేషాలు మీకు తెలుసా..?!

మన దేశంలో రకరకాల సంప్రదాయాలు, వింత వింత ఆచారాలు ఇప్పటికి నిర్వహిస్తూనే వస్తున్నారు.ఈ క్రమంలోనే ఇప్పుడు కూడా ఒక వింత జాతర గురించి మీకు చెప్పాలి.

 Do You Know About This Mud Festival In Yelamanchili Details, Buddha Jathara, La-TeluguStop.com

ఆ జాతర పేరు బురదమాంబ జాతర.ఈ జాతరను విశాఖ జిల్లాలో చాలా ఘనంగా చేసుకుంటూ ఉంటారు.

మొన్నటికి మొన్న వెదుళ్ళ పండగ జరగగా ఇప్పుడు బురదమాంబ పండుగ జరుగనుంది.విశాఖపట్నం జిల్లాలోని దిమిలిలో బురదమాంబ సంబరం మంగళవారం ఉదయం రోజున ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు.

ఇక్కడ జరిగే ఈ జాతర రాష్ట్రంలో ఎక్కడ జరగని రీతిలో చాలా విచిత్రంగా ఉంటుంది.అసలు ఇంతకీ ఈ జాతర ఎక్కడ జరుగుతుంది.

ఆ జాతర యొక్క విశేషాలు ఏంటి అనే విషయాలు ఒకసారి తెలుసుకుందామా.

యలమంచిలి నియోజకవర్గంలోని రాంబిల్లి మండలంలో కొలువుదీరిన ఈ దిమిలి గ్రామ దేవతే దల్లమాంబ.

అనుపు మహోత్సవం సందర్భంగా ఈ గ్రామంలో బురదమాంబ జాతర జరిపించడం అక్కడ ఎప్పటినుంచో ఆనవాయితీగా వస్తోంది.ఈ జాతర మంగళవారం ఉదయం 10 గంటల వరకు జరుగుతుంది.

అలాగే సోమవారం అర్ధరాత్రి నుంచే బురదమాంబ జాతర కోలాహలం అక్కడ కనిపిస్తుంది.ఈ జాతరలో ఆ గ్రామంలోని పురుషులందరు కలిసి వేపకొమ్మలు చేతితో పట్టుకొని, మురుగుకాలువల్లోని బురదలో ఆ వేపకొమ్మలను ముంచి ఆ బురదను ఒకరిపై ఒకరు జల్లుకుంటూ కేరింతలు కొడుతూ అందరూ ఎంజాయ్ చేయడమే ఈ ఉత్సవం యొక్క ప్రత్యేకత అని చెప్పాలి.

Telugu Buddha Jathara, Diseases, Latest, Mud Fest, Vishakapatam, Yelamanchilimud

బురదలో ఆటలు ఆడడం ఏంటి? రోగాలు రావా? అని అనుకుంటున్నారా.రావు అనే అంటున్నారు అక్కడ ప్రజలు.బురద పూసుకున్నా గాని ఎటువంటి చర్మ వ్యాధులు రాకుండా అమ్మవారూ మమ్మల్ని కాపాడతారు.అది అంతా అమ్మవారి మహత్యం అని అక్కడి గ్రామస్తులు నమ్ముతారు.బురదలో ఆటలు ఆడిన తరువాత ఆ వేప కొమ్మలను అమ్మవారి ఆలయం వద్ద ఉంచి ఘనంగా అమ్మవారి జాతరను నిర్వహిస్తారు.కేవలం మగవారు మాత్రమే ఇలా బురద జల్లుకుంటారు.

ఆడవాళ్లు బురద జల్లుకోరు.ఇక్కడ కొలువై ఉన్న అమ్మవారి యొక్క విగ్రహం బురదలో లభించడం వలన ఆమెను బురదమాంబగా పిలుస్తారు అని అక్కడి గ్రామస్తులు అంటున్నారు.

చూసే వాళ్ళకి విచిత్రంగా ఉన్న ఆ ఆచారాన్ని అక్కడ గ్రామస్థులు ఎప్పటినుంచో పాటిస్తున్నారు.!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube