ప్రస్తుత సమాజంలో తెలుగు రాష్ట్రాలలో పండుగ విషయాల్లో ఎప్పుడూ ఏదో ఒక గందరగోళం కనిపిస్తూ ఉంది.పండుగ ఎప్పుడు జరుపుకోవాలి అని అందరూ తర్జన భర్జన పడాల్సి వస్తుంది.ఒక్కో కేలండర్ లో ఒక్క విధంగా పండుగ( Festival ) తేదీలను వెల్లడిస్తున్నారు.2023వ సంవత్సరంలో అధికమాసం ఏర్పడడం వల్ల పండుగల పర్వదినాల విషయంలో కొంత అస్పష్టత ఏర్పడుతూ ఉంది.ఏ రోజు ఏ పండుగ వస్తుందో జనాలకు అర్థం కావడం లేదు.ఒకరు ఒకరోజు పండుగ అంటే మరొకరు అదే రోజు ఇంకో పండుగ అని చెబుతున్నారు.
దీంతో అసలు ఏ పండుగ ఎప్పుడు జరుపుకోవాలో తెలియక గందరగోళ పరిస్థితిలో ప్రజలు ఉన్నారు.

తిధులు పంచాంగాన్ని ఆధారంగా చేసుకుని చూస్తే ఒక్కో పండుగ శుభ ఘడియలు రెండు రోజులపాటు ఉంటున్నాయి.ఈ క్రమంలో వినాయక చవితి( Vinayaka Chavithi )పండుగ జరపాలిఅనేవిషయాన్ని,పండితులు ( Scholars )ఏ ఆధారాలతో నిర్ణయిస్తూ ఉంటారో ఇప్పుడు తెలుసుకుందాం.జ్యోతిష్య శాస్త్రం( Astrology ) ప్రకారం సాధారణంగా సూర్యోదయ స్పర్శ కలిగిన తిధి పండుగలు జరపడం లేదా విజ్ఞానం కలిగిన మన పెద్దలు అనుసరిస్తున్న సంప్రదాయం అని నిపుణులు చెబుతున్నారు.

సాధారణంగా సూర్యోదయ స్పర్శ కలిగిన తిధి పండుగలు జరపడం వేద విజ్ఞానం కలిగిన మన పెద్దలు అనుసరిస్తున్న సంప్రదాయం అని చెబుతున్నారు.ఈ క్రమంలో కృష్ణాష్టమిని మనం చూసినట్లయితే సెప్టెంబర్ ఆరవ తేదీ బుధవారం రాత్రి 8 గంటల 7 నిమిషముల వరకు సప్తమి తిధి ఉంది.తర్వాత మాత్రమే అష్టమి వచ్చింది.దాంతో కృష్ణాష్టమినీ బుధవారం జరపలా లేక గురువారం జరపాలా అనే సందేహం చాలా మందికి వచ్చింది. శ్రీకృష్ణుడు ( Lord Krishna )అష్టమి రోజు అర్ధరాత్రి రోహిణి నక్షత్రం( Rohini Nakshatra )లో జన్మించాడు.కాబట్టి అష్టమి తేదీ అర్ధరాత్రి వేళ ఉండడం ముఖ్యం.
అలాగే రోహిణి నక్షత్రం ఉన్న లేకపోయినా తిది ప్రాధాన్యత ఎంతో ఉంది.అర్ధరాత్రి ఏ రోజు అయితే ఉంటుందో ఆ రోజే కృష్ణ అష్టమిగా నిర్ణయించబడింది.
దాంతో బుధవారం కృష్ణాష్టమి ( Krishnashtami )గా నిర్వహించడం జరిగింది.