కాంగ్రెస్‌కు రేవంత్‌రెడ్డి టీపీసీసీ చీఫ్ అయిన తర్వాత అనేక అసంతృప్తులు బయటపడ్డాయి.అప్పటి నుంచి ఇప్పటి దాకా కూడా కొందరు సీనియర్లు రేవంత్ నాయకత్వాన్ని ఒప్పుకోవట్లేదు.
దీంతో చాలా గ్రూపులుగా కాంగ్రెస్ చీలిపోతోంది.రేవంత్ పార్టీ చీప్‌గా ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా కూడా పెద్దగా ఎవరూ పట్టించుకోవట్లేదు.
కాంగ్రెస్ నేతలకు సొంత పార్టీ నేలపైనే ఢిల్లీ అధిష్టానానికి ఫిర్యాదులు చేయడం మళ్లీ అలవాటవుతోంది.ఇక ఇదే క్రమంలో ఇప్పుడు మరసారి ఏకంగా రేవంత్ సమక్షంలోనే రాహుల్ గాంధీకి కంప్లయింట్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఇక రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ అయిన తర్వాత ఆయన చేస్తున్న పనుల గురించి తెలుసుకునేందుకు ఆ పార్టీ ముఖ్యనేత రాహుల్ గాంధీ కొత్త టీమ్‌తో పాటు కొందరు సీనియర్లతోనూ ఇటీవల ఢిల్లీలో సమావేశం నిర్వహించారు.అయితే ఈ సమావేశంలో కొందరు ప్రస్తతం తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతానికి ఎలాంటి పనులు చేస్తున్నారో అలాగే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో వివరించారు.
అయితే మరికొందరు నేతలు మాత్రం అదే పనిగా కొత్త టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఇన్ డైరెక్టుగా కంప్లయింట్ చేసేందుకు ట్రై చేశారని తెలుస్తోంది.

కొత్తగా టీపీసీసీ కమిటీగా ఎన్నికైన వారు మాత్రం పార్టీలో తీసుకునే నిర్ణయాలు ముందుగా అందరితో చర్చించకుండానే తీసుకుంటారని రాహుల్ కు కంప్లయింట్ చేశారంట.అయితే ప్రతిసారి లాగా ఆలస్యం చేయకుండా ఈసారి రాహుల్ గాంధీ తెలంగాణలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ ద్వారా ప్రస్తుత పరిస్థితులపై, నేతల వ్యవహార శైలిపై పూర్తిగా సమాచారం తెప్పించుకుని చదివారు.కాబట్టి ఎవరు ఎన్ని ఫిర్యాదులు చేసినా పెద్దగా పట్టించుకోలేదంట.
ఇలా ఒకరిపై ఒకరు కంప్లయింట్లు చేసుకోకుండా కలిసికట్టుగా పనిచేయాలంటూ ఆదేశించారంట.ఇక ఈ విషయంలో రేవంత్‌కు మాత్రం ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దని రాబోయేఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చే దిశగానే పనిచేయాలంటూ సపోర్టు ఇస్తానని చెప్పారంట.