మనం ఆరోగ్యంగా ఉండాలంటే సమయానికి మూత్ర విసర్జన( Urine ) చేస్తూ ఉండాలి.లేదంటే ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడవలసి వస్తుంది.
అంతేకాకుండా సమయానికి ఈ పని చేయకపోతే మీ మెదడు పనితీరు కూడా మందగిస్తుంది.భూమి పై ఉన్న ప్రతి జీవికి మూత్ర విసర్జన అనేది ఎంతో ముఖ్యం.
మనిషి సగటున రోజుకు ఏడుసార్లు మూత్ర విసర్జన చేయాలి.ఏడుసార్లు కంటే తక్కువగాను, ఎక్కువగాను మూత్ర విసర్జన చేస్తే ఏదో తెలియని అనారోగ్యం వారి శరీరంలో ఉందని అర్థం చేసుకోవచ్చు.

ఈ విధంగా ఆరోగ్యంగా ఉండే వ్యక్తి మూత్ర విసర్జన సమయం దాదాపు ఏడు సెకండ్లు అని వైద్యనిపుణులు చెబుతున్నారు.రెండు సెకండ్ల కంటే తక్కువ సమయంలోనే మూత్రం పూర్తయితే వారికి ఇన్ఫెక్షన్( Infection ) ఉందని అర్థం చేసుకోవచ్చు.మూత్ర సమస్యలు ఎందుకు వస్తాయి.మూత్రం రంగు( Urine Color ) మారితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.సాధారణంగా చెప్పాలంటే మనం తీసుకున్న ఆహారాన్ని శరీరం వివిధ రకాలుగా విడగొడుతూ ఉంటుంది.

ఇలా విడగొట్టబడిన ఆహారంలో శరీరానికి కావాల్సిన పోషకాలను గ్రహించి మిగిలిన వ్యర్ధాలను మూత్ర, మాల రూపంలో విసర్జింపబడుతుంది.ఇక మూత్రం రంగును బట్టి మీ ఆరోగ్యం ఎలా ఉందో త్వరగా చెప్పవచ్చు.మూత్రం తెలుపు రంగులో( White Color Urine ) ఉంటే శరీరానికి సరిపడా నీటిని తీసుకున్నారని అర్థం చేసుకోవచ్చు.
మూత్రం రంగు మారి ఎరుపు రంగులో కనిపిస్తే మూత్రంలో రక్తం కలిసిందని అర్థం చేసుకోవచ్చు.ఇలా జరిగినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.మరి కొంతమందికి మూత్రం నీలం రంగులో వస్తుంది.ఇది ఎక్కువగా పసిపిల్లలలో కనిపిస్తుంది.
ఇది జన్యులోప సమస్య అని వైద్యులు చెబుతున్నారు.మూత్రం గురించి మనకు తెలియని విషయం ఏమిటంటే రోమన్లు మూత్రంలో పుక్కిలించేవారట దీనివల్ల దంతాలు మెరుస్తాయని వారి నమ్మకం.