తెలంగాణలో బీజేపీ చాలా బలంగా ఉందని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.వరంగల్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభను విజయవంతం చేస్తామని తెలిపారు.
పార్టీ యంత్రాంగం అంతా మోదీ సభను విజయవంతం చేసేందుకు ప్రయత్నిస్తుందని పేర్కొన్నారు.ప్రధాని పర్యటన నేపథ్యంలో ఇప్పటికే కిషన్ రెడ్డి సమీక్ష నిర్వహించారని వెల్లడించారు.
బీజేపీపై కొందరు విషం కక్కే ప్రయత్నం చేస్తున్నారని ఈటల రాజేందర్ ఆరోపించారు.బీజేపీ -బీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు.
కేసీఆర్ దోపిడీని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.







