సాధారణంగా కొందరికి పొడవాటి జుట్టు పై మక్కువ ఉంటుంది.ఆ మక్కువతోనే జుట్టుపై రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు.
లాంగ్ హెయిర్(Long hair ) ను పొందడం కోసం ఖరీదైన హెయిర్ ఆయిల్స్ వాడుతుంటారు.అయినా సరే జుట్టు పెరుగుదలలో పెద్దగా మార్పు లేదు అనుకుంటే కచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే సీరం ను ట్రై చేయండి.
ఈ సీరం హెయిర్ గ్రోత్ ను ప్రమోట్ చేస్తుంది.అదిరిపోయే బెనిఫిట్స్ ను మీ సొంతం చేస్తుంది.
సీరం తయారీ కోసం.ముందుగా ఒక చిన్న సైజు ఉల్లిపాయ( Onion )ను తీసుకుని పీల్ తొలగించి వాటర్ తో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, రెండు మందారం ఆకులు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.
ఈ జ్యూస్ లో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్( Aloe Vera Gel ), వన్ టేబుల్ స్పూన్ ఆవనూనె, వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేస్తే మన సీరం అనేది రెడీ అవుతుంది.ఈ సీరం ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి అప్లై చేసుకుని మసాజ్ చేసుకోవాలి.సీరం అప్లై చేసుకున్న గంట అనంతరం తేలిక పాటి షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.
వారానికి ఒక్కసారి ఈ న్యాచురల్ సీరం ను వాడితే జుట్టు పెరుగుదల మెరుగుపడుతుంది.కొద్ది రోజుల్లోనే మీ కురులు పొడుగ్గా మారతాయి.అలాగే ఈ సీరంను వాడటం వల్ల హెయిర్ ఫాల్ సమస్యను సులభంగా వదిలించుకోవచ్చు.
జుట్టును సిల్కీగా, షైనీ గా మెరిపించుకోవచ్చు.మరియు ఈ సీరం మీ జుట్టును ఆరోగ్యంగా మరియు దృఢంగా సైతం మారుస్తుంది.