మన శరీరంలో సుమారుగా 70 నుండి 80 శాతం నీరు ఉంటుంది.అందువల్ల శరీర బరువులో నీరు ఒక బాగంగా ఉంటుంది.
నీటి బరువు ఎక్కువైతే చాలా మంది ఉబ్బినట్టు కనిపిస్తారు.అందువలన బరువును వేగంగా తగ్గించుకొనే క్రమంలో నీటి బరువు కోల్పోవటం చాలా అవసరం.
అందువల్ల నీటిని కోల్పోవటానికి కొన్ని ఇంటి నివారణలు ఉన్నాయి.వాటి గురించి తెలుసుకుందాం.
1.టమోటా:
టమోటాలో కాల్షియం మరియు విటమిన్ సి సమృద్దిగా ఉండుట వలన వేగంగా నీటిని కోల్పోవటానికి సహాయపడుతుంది.టమోటాను సలాడ్స్ రూపంలో గాని నేరుగా గాని తినవచ్చు.టమోటాను ముక్కలుగా కోసి ఉప్పు,మిరియాల పోడి చల్లుకొని తినవచ్చు.రెండు లేదా మూడు టమోటాలను బ్లెండ్ చేసి నీటిని కలిపి టమోటా రసాన్ని తీయాలి.ఈ రసానికి ఉప్పు,మిరియాల పొడి చేర్చి మరిగించాలి.ఈ రసాన్ని క్రమం తప్పకుండా త్రాగితే మంచి పలితాలు వస్తాయి.
2.పుచ్చకాయ:
పుచ్చకాయలో మెగ్నీషియం, విటమిన్ ఎ మరియు సి సమృద్దిగా ఉంటాయి.పుచ్చకాయ ముక్కలలో నల్ల ఉప్పు కలుపుకొని తినవచ్చు.
నీటి బరువును కోల్పోవటానికి తరచుగా పుచ్చకాయ ముక్కలను తినాలి.పుచ్చకాయ రసాన్ని కూడా త్రాగవచ్చు.అలాగే పుచ్చకాయ రసంలో పెరుగు,మిరియాల పొడిని కలిపి వారంలో మూడు సార్లు త్రాగితే మంచి పలితం కనపడుతుంది.
3.దోసకాయ:
దోసకాయ అధిక నీటి కంటెంట్ మరియు శరీరం యొక్క pH స్థాయిలను నిర్వహిస్తుంది.ప్రతి రోజు ఆహారంలో దోసకాయ ముక్కలు ఉండేలా చూసుకోవాలి.
అలాగే దోసకాయ రసాన్ని కూడా త్రాగవచ్చు.దోసకాయ రసంలో పుదినా,నిమ్మరసం కలిపి క్రమం తప్పకుండా త్రాగితే నీటి బరువు కోల్పోవటంలో బాగా సహాయపడుతుంది.
4.క్యారెట్లు:
క్యారెట్ నీటి బరువును తగ్గించటానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.ప్రతి రోజు ఆహారంలో క్యారెట్ ముక్కలు ఉండేలా చూసుకోవాలి.క్యారెట్ ముక్కలపై ఉప్పు,నిమ్మరసం పిండుకొని కూడా తినవచ్చు.అలాగే క్యారెట్, పాలు కలిపి మిక్సీ చేసి జ్యూస్ గా త్రాగవచ్చు.ప్రతి రోజు క్యారెట్ జ్యూస్ త్రాగితే బరువు కోల్పోవటంతో పాటు జీవక్రియకు కూడా సహాయపడుతుంది.