ఈ మధ్యకాలంలో చాలామంది రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.అయితే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఆరోగ్యం పట్ల తప్పకుండా చాలా శ్రద్ధ తీసుకోవాలి.
లేదంటే ఇది మరింత ప్రమాదానికి దారితీస్తుంది.ఈ మధ్యకాలంలో చాలామందికి బీపీ, షుగర్ లాంటి ప్రమాదకరమైన అనారోగ్యాలు ఎక్కువగా ఉన్నాయి.
ఈ సమస్యలతో బాధపడే వారు కచ్చితంగా ఈ విషయాలను తెలుసుకోవాలి.బీపీ, షుగర్ ఉన్నవారు కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.
అంతేకాకుండా ఖచ్చితంగా కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవాలి.అయితే బీపీ, షుగర్ ఉన్నవాళ్లు ఆహారం విషయంలో ఎలాంటి నియమాలని పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

బీపీ షుగర్( BP Sugar ) వలన గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా ఉంది.ఇక చాలామంది బ్రేక్ఫాస్ట్ తీసుకునే సమయంలో కార్న్ ఫ్లెక్స్ ని తింటూ ఉంటారు.ఇవి మంచివే కానీ షుగర్ లానే ప్రాసెస్ చేస్తారు.కాబట్టి వాటిని తినడం వలన షుగర్ లెవెల్స్ పెరుగుతాయి.అయితే అలా కాకుండా మీరు హోల్ గ్రైన్స్( Whole Grains ) ని తీసుకోవడం మంచిది.ఎందుకంటే వీటిలో చక్కెర తక్కువ ఉంటుంది.
రోజుకు కనీసం మూడు గ్రాముల ఫైబర్ తీసుకోవడం మంచిది.హోల్ గ్రైన్స్ ని తీసుకోవడం వలన ఫైబర్ అందుతుంది.
దానితో పాటుగా మీరు ఒక కప్పు పాలు తీసుకోవడం కూడా మంచిది.ఓట్స్ తీసుకోవడం వలన మంచిదే కానీ, ఓట్స్ తీసుకునే పద్ధతిలో కూడా చాలామంది తప్పులు చేస్తూ ఉంటారు.

మసాలా ఓట్స్ ని తీసుకోవడం అంత మంచిది కాదు.సాదా ఓట్స్ ( Oats )తీసుకోవడం మంచిది.దీంతోపాటు తాజా పండ్లు( fruits ) లాంటివి కూడా తీసుకోవచ్చు.షుగర్, బీపీ ఉన్నవారు బ్రేక్ ఫాస్ట్ లో పెరుగు తీసుకోవడం కూడా మంచిది.అయితే బ్రేక్ ఫాస్ట్ కి పెరుగు మంచి రుచిని ఇస్తుంది.ఎలాంటి ఫ్లేవర్స్ లేకుండా ఇంట్లో చేసిన పెరుగును తీసుకోవడం వలన ఆరోగ్యం బాగుంటుంది.
ఇక షుగర్, హై బీపీ ఉన్నవారు బ్రేక్ ఫాస్ట్ లో గుడ్డు తీసుకోవడం చాలా మంచి విషయం.ఉడికించిన గుడ్డును తీసుకోవడం లేదా కూరగాయలతో పాటు ఆమ్లెట్ చేసి తీసుకోవడం వలన మంచి పోషకాలు లభిస్తాయి.