రానున్న ఎన్నికల్లో అధికారం సాధించడమే తన లక్ష్యమని పవన్ కళ్యాణ్ చెబుతున్నాడు.అయితే జనసేన పార్టీలో అంతర్గతంగా మాత్రం చర్చ మాత్రం వేరొకటి జరుగుతుంది.2024లో తమ పార్టీ ఏకంగా అధికారంలోకి రావడం కష్టమైన విషయం కానీ 2029 ఎన్నికలను టార్గెట్ చేసుకొని రానున్న రోజుల్లో బలమైన పునాదులు వేసుకోవాలని భావిస్తున్నారట.అందుకు తగ్గట్టు వ్యూహాన్ని కూడా అమలు చేసుకుంటున్నట్లు సమాచారం.
ఉన్న విషయం సూటిగా మాట్లాడుకుంటే ప్రస్తుతం రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టేందుకు జనసేన దగ్గర ఉన్న బలం సరిపోదు.ఒకవేళ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు అనే అనుకుందాం.
అప్పుడు కూడా కేవలం 40 స్థానాలు మాత్రమే వారికి దక్కుతాయి.వీటితో ఒక ఐదు నుండి ఆరు జిల్లాలను టార్గెట్ చేసి అందులో బలమైన స్థానాలను ఎంచుకొని పార్టీని బలోపేతం చేసే దిశగా ఆలోచిస్తున్నారట.
ప్రస్తుతానికి శ్రీకాకుళం, విజయవాడ, గుంటూరు, కర్నూలు, విజయనగరం, ఉభయ గోదావరి జిల్లాలు, అనంతపురం లో పార్టీని బలోపేతం చేసే విధంగా అడుగులు వేస్తున్నారట.ఈ జిల్లాలలో బలంగా పునాది వేసుకొని 2029 ఎన్నికలు టార్గెట్ గా పార్టీ కార్యకలాపాలు జరగనున్నాయని అంటున్నారు.
కనీసం ఒక 30 మందిని గెలిపించుకుంటే రాష్ట్రంలో 2029 నాటికి బలమైన శక్తి ఎదిగేందుకు అవకాశం ఉంటుందని పవన్ కళ్యాణ్ కూడా చెబుతున్నారట.
25 నుండి 30 సీట్లలో ఒకటి రెండు సీట్లు తగ్గినా కూడా అసెంబ్లీలో గట్టిగా తమ వాయిస్ వినిపించడానికి ఆ తర్వాత ఎన్నికల్లో అధికార పార్టీ వెన్ను విరిచి ప్రజలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేయవచ్చు అని అనుకుంటున్నారట.ఇక ప్రచారం కూడా అలాగే అనుకున్న జిల్లాల్లో ముమ్మరం చేసి కచ్చితంగా ఒక 30 సీట్లలో అయితే గెలుపు ఫిక్స్ చేసుకోవాలని భావిస్తున్నారట.మరి ఇది ఎంతవరకు జరుగుతుంది అన్న విషయం మాత్రం వేచి చూడాలి.