విటమిన్ డి లోపం రాకూడ‌దంటే ఎండ‌లో ఎంత‌సేపు ఉండాలో తెలుసా?

మ‌న శ‌రీరానికి కావాల్సిన అతి ముఖ్య‌మైన పోష‌కాల్లో విట‌మిన్ డి ముందు వ‌ర‌స‌లో ఉంటుంది.శ‌రీరానికి విట‌మిన్ డి పుష్క‌లంగా అందితేనే రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ బ‌లంగా ఉంటుంది.

 Do You Know How Long Can Stay In The Sun To Prevent Vitamin D Deficiency?vitamin-TeluguStop.com

ఎముక‌లు, కండ‌రాలు దృఢంగా ఉంటాయి.ఒత్తిడి, డిప్రెష‌న్ వంటి మాన‌సిక స‌మ‌స్య‌లు దూరంగా ఉంటాయి.

ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపు త‌ప్ప‌కుండా ఉంటాయి.గుండె జ‌బ్బులు ద‌రి చేర‌కుండా ఉంటాయి.

మెద‌డు చురుగ్గా ప‌ని చేస్తుంది.అందు వ‌ల్ల‌నే విట‌మిన్ డి ని రెగ్యుల‌ర్‌గా పొందాల‌ని ఆరోగ్య నిపుణులు ఎప్ప‌టి క‌ప్పుడు సూచిస్తుంటారు.

అయితే సూర్య రశ్మి ద్వారా నేరుగా శరీరాన్ని తాకే కిరణాలు వ‌ల్ల విట‌మిన్ డిను పొందొచ్చ‌ని విష‌యం అంద‌రికీ తెలుసు.కానీ, ఎండ‌లో ఎంత సేపు ఉంటే శ‌రీరానికి విట‌మిన్ డి పుష్క‌లంగా అందుతుంది.? అన్న విష‌యం చాలా మందికి తెలియ‌దు.నిజానికి మనం ఎంతసేపు సూర్మరశ్మిలో ఉంటామన్న దాని మీదే మన శరీరంలోని విటమిన్ డి ఆధారపడి ఉంటుంది.

అందుకే విట‌మిన్ డి కోసం ఎండ‌లో ఉండ‌టం కాదు.ఎంత స‌మ‌యం పాటు ఉంటున్నాము కూడా చూసుకోవాలి.అయితే వేస‌వి కాలంలో ఎండ ఎక్కువ‌గా ఉంటుంది.కాబ‌ట్టి, ఉద‌యం పూట‌ ప‌ది నుంచి ఇర‌వై నిమిషాల ఉంటే శ‌రీరానికి విట‌మిన్ డి చ‌క్క‌గా అందుతుంది.ఇక శీతా కాలంలో ఎండ కాస్త త‌క్కువ‌గా ఉంటుంది.అందు వ‌ల్ల‌, గంట నుంచి రెండు గంట‌ల వ‌ర‌కు ఎండ‌లో ఉండొచ్చు.

ఇక కొన్ని కొన్ని ఆహారాల ద్వారా సైతం విట‌మిన్ డిని పొందొచ్చు.చేప‌లు, పుట్ట‌గొడుగులు, గుడ్డు, బీఫ్ లివర్, చీజ్, కోడి గుడ్లు, పాలు, రొయ్య‌లు, బీన్స్ వంటి వాటిలో విట‌మిన్ డి ఉంటుంది.

వీటిని కూడా డైట్‌లో చేర్చుకుంటే.శ‌రీరంలో విట‌మిన్ డి కొర‌తే ఏర్ప‌డ‌కుండా ఉంటుంది.త‌ద్వారా మీరు ఆరోగ్యంగా జీవించ‌వ‌చ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube