కర్ణాటక మంగళూరులో( Mangaluru ) ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది.పొరుగువారితో తరచూ గొడవపడే ఓ వ్యక్తి ప్రతీకారం తీర్చుకోవాలని ప్లాన్ వేసి, తన కారుతో నేరుగా వారిపై దాడి చేశాడు.
అయితే ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా( Viral Video ) మారింది.
మంగళూరులోని బెజై-కపికాడ్లో 6వ క్రాస్ రోడ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది.రిటైర్డ్ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి సతీష్ కుమార్ (69)( Sathish Kumar ) తన పొరిగింటి వ్యక్తి మురళీ ప్రసాద్‌ను( Murali Prasad ) చంపేయాలని పక్కా ప్లాన్ వేశాడు.
మురళీ ద్విచక్ర వాహనం నడుపుకుంటూ వెళ్తుండగా, సతీష్ అతన్ని కారుతో ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టాడు.అయితే, దురదృష్టవశాత్తు అదే సమయంలో రహదారి పక్కన నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ కూడా కారును ఢీకొట్టడంతో గాయపడింది.
సతీష్ కుమార్ కారు వేగంగా వచ్చి మురళీ ప్రసాద్ బైక్‌ను గుద్దింది.దీంతో అతను కింద పడిపోయి తీవ్రగాయాలపాలయ్యాడు.అదే సమయంలో, అదే దారిలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళపై కూడా కారు అదుపుతప్పి దూసుకెళ్లింది.కారు ఢీకొట్టడంతో ఆ మహిళ గాల్లోకి ఎగిరి ఎదురుగా ఉన్న కాంపౌండ్ గోడ గ్రిల్లో చిక్కుకుంది.
తలకిందులుగా వేలాడుతూ అక్కడే ఉండిపోయింది.ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు వెంటనే స్పందించి, ఆమెను గ్రిల్ నుంచి బయటకు తీశారు.
సతీష్ కుమార్, మురళీ ప్రసాద్ ఇద్దరూ ఎదురెదురుగా నివసిస్తున్నారు.వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి.మురళీని ఎలాగైనా చంపాలనే ఉద్దేశంతోనే సతీష్ ఈ దాడిని చేయడానికి సిద్ధమయ్యాడు.అయితే, మురళీ ప్రసాద్ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.తీవ్ర గాయాలు అయినప్పటికీ ప్రాణాలతో బయటపడ్డాడు.ఈ ఘటనపై మురళీ ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
‘‘సతీష్ కుమార్ నన్ను చంపేందుకు తన కారును ఉద్దేశపూర్వకంగా నడిపాడు.మమ్మల్ని తరచూ వేధించేవాడు.మా తండ్రిని కూడా చంపేందుకు ప్రయత్నించాడు.2023లో కూడా మా ఫ్యామిలీపై దాడి చేయడానికి యత్నించాడు’’ అని ఫిర్యాదులో పేర్కొన్నాడు.పోలీసులు ఈ ఫిర్యాదు ఆధారంగా సతీష్ కుమార్‌ను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.అతనిపై IPC సెక్షన్ 109 (హత్యాయత్నం), 118 (1) (రెచ్చగొట్టే చర్యలు) కింద కేసు నమోదు చేశారు.