వేదికపైనే వధువు ఎదుట వరుడిని కౌగిలించుకున్న యువతి.. వీడియో వైరల్

ఈ మధ్య కాలంలో వివాహ వేడుకల్లో సినీ తరహా సంఘటనలు చోటుచేసుకోవడం మామూలైపోయింది. పెళ్లి కార్యక్రమంలో ( wedding ceremony )ఈ మధ్య అనేక రకాల వీడియోలు మనం చూస్తూనే ఉంటాం.

 Video Of Young Woman Hugging Groom In Front Of Bride On Stage Goes Viral, Young-TeluguStop.com

ముఖ్యంగా పెళ్లి కూతురు, పెళ్లికొడుకు( Bride, groom ) స్టేజ్ పై చేసే మాస్ డాన్స్ గురించి కొన్ని వీడియోలు అవుతుంటే, మరికొన్ని వధూవరుల స్నేహితుల చేసే కొన్ని అల్లరి సంఘటన ద్వారా వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ అవుతూ ఉంటాయి.తాజాగా, అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఓ వివాహ వేదికపై ఓ యువతి నేరుగా వచ్చి వరుడిని కౌగిలించుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.వరుడితో పాటు వధువు కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఏం జరుగుతుందో అర్థం కాక చూస్తూ ఉండిపోయారు.వరుడు ఆ యువతిని దూరంగా నెట్టాలని ఎంత ప్రయత్నించినా ఆమె అతన్ని గట్టిగా పట్టుకుంది.ఈ ఘటనతో పెళ్లి వేదికపై కొద్దిసేపు అలజడి నెలకొంది.కానీ, కొంతసేపటి తర్వాత అసలు విషయం బయటకొచ్చింది.ఈ యువతి నిజంగా అమ్మాయి కాదని, వరుడిని ఆటపట్టించేందుకు అతని స్నేహితుడు ఆడ వేషంలో వచ్చి ప్రాంక్ చేసాడు.

ఈ విషయం తెలిసిన వెంటనే పెళ్లి వేదిక నవ్వులతో మారుమోగిపోయింది.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.నెటిజన్లు ఈ సంఘటనపై ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.‘‘వరుడికి ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పనైందిగా ’’ అని కొందరు కామెంట్ చేస్తుండగా, మరికొందరేమో.

స్నేహితుడు అంటే నువ్వేరా అంటూ హాస్యసభరంగా స్పందిస్తున్నారు.ఇంకొందరు ఇలా ఎలా వస్తాయి ఆలోచనలు అంటూ కొందరు కామెంట్ చేస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube