సోషల్ మీడియా పుణ్యమా అని.అప్పుడప్పుడు మట్టిలో మాణిక్యాలు ప్రపంచానికి పరిచయం అవుతారు.
తమ అద్భుత టాలెంట్ తో ఓవర్ నైట్ స్టార్స్ గా మారిపోతుంటారు.అలా రాత్రికి రాత్రే సెలబ్రిగా మారిన వారిలో రేణు మండల్ అనే గాయని ఉంది.
రైల్వే స్టేషన్ లో బిచ్చెగత్తెగా ఉంటూ తన అద్భుత గాత్రంతో తేరే.మేరే.
అంటూ పాడిన పాట దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది.సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది.
ఆమె పాట పాడిన తీరుపై నెటిజన్లతో పాటు ప్రముఖ సింగర్లు, సంగీత దర్శకులు ప్రశంసలు కురినించారు.సోను నిగమ్ లాంటి వారు తమ సింగర్ గా అవకాశం కల్పించారు.
అటు తెలుగులోనూ ఓ రేణు మండల్ లాంటి ఓ మహిళ బయటకు వచ్చింది.తన పేరే బేబి.తన చక్కటి గాత్రంతో అద్భుతంగా పాడుతూ రాత్రికి రాత్రే బాగా పాపులర్ అయ్యింది.తేనెలూరే తన వాయిస్ తో జనాలను అద్భుతంగా ఆకట్టుకుంది.
ఈమె పాటలకు టాలీవుడ్ పెద్దలంతా అవాక్కయ్యారు.మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఆమెను ప్రత్యేకంగా ఇంటికి ఆహ్వానించి సన్మానించారు.
చిరంజీవి సతీమణి సురేఖ బేబిని ప్రత్యేకంగా అభినందించింది.ఇకపై మంచి జీవితాన్ని గడపాలని ఆశీర్వదించింది.
అటు ప్రముఖ సంగీత దర్శకులు కోటి, ఏఆర్ రెహ్మాన్ బేబి పాటలపై ప్రశంసలు కురిపించారు.ఎలాంటి సాధన లేకపోయినా.అద్భుతంగా పాడటం పట్ల తాను ఆశ్చర్యపోయానని రెహ్మాన్ ట్వీట్ చేశాడు.రఘు కుంచె లాంటి సంగీత దర్శకులు ఆమెను తన వెహికల్ లో కూర్చోబెట్టుకుని ఇంటర్వ్యూ చేశాడు.
తను మంచి అవకాశాలు ఇవ్వబోతున్నట్లు చెప్పాడు.అయితే.
తొలుత బాగా పాపులర్ అయిన బేబీని ఆ తర్వాత అందరూ మర్చిపోయారు.ఆమెకు అవకాశాలూ రాలేదు.
ఓ రేణు మండల్, మరో బేబీ.వీరింతా ఇలా వచ్చ.
అలా వెళ్లే వారే తప్ప.ఇండస్ట్రీలో పాతుకుపోయే వారు కాదని తాజాగా రఘు కుంచె వ్యాఖ్యానించాడు.