మధుమేహులకు వరం ఆవాలు.. ఇలా తీసుకుంటే అదిరిపోయే లాభాలు..!

ప్రస్తుత రోజుల్లో మధుమేహం( Diabetes ) బారిన పడుతున్న భారీ సంఖ్య ఎంతలా పెరిగిపోతుందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు.దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో మధుమేహం బాధితులు ఉంటున్నారు.

 Health Benefits Of Mustard Seeds For Diabetic Patients! Mustard Seeds, Mustard S-TeluguStop.com

అయితే మధుమేహం ఉన్నవారిలో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్‌లో ఉంచడానికి కొన్ని కొన్ని ఆహారాలు చాలా బాగా సహాయపడతాయి.అటువంటి వాటిల్లో ఆవాలు కూడా ఒకటి.

మధుమేహులకు ఆవాలు ఒక వారం అనే చెప్పుకోవచ్చు.ముఖ్యంగా ఆవాలను ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉండడమే కాకుండా అదిరిపోయే ఆరోగ్యాలు లాభాలు మీ సొంతం అవుతాయి.

Telugu Diabetes, Diabetic, Tips, Latest, Mud Powder, Mud Seeds-Telugu Health

అందుకోసం మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక చిన్న కప్పు ఆవాలు వేసి పొడి మాదిరి గ్రైండ్ చేసుకోవాలి.ఈ ఆవాల పొడిని ఒక బాక్స్ లో నింపుకుని స్టోర్ చేసుకోవాలి.ప్రతిరోజు ఒక కప్పు పెరుగులో పావు టీ స్పూన్ ఆవాల పొడి( Mustard powder ) మరియు చిటికెడు పింక్ సాల్ట్( Pink salt ) వేసుకుని కలిపి తీసుకోవాలి.మధుమేహం ఉన్నవారు నిత్యం ఈ విధంగా ఆవాలను తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

Telugu Diabetes, Diabetic, Tips, Latest, Mud Powder, Mud Seeds-Telugu Health

అలాగే ఆవపిండిలో గ్లూకోసినోలేట్స్ మరియు మైరోసినేస్ వంటి సమ్మేళనాలు ఉంటాయి.ఇవి శరీరంలో క్యాన్సర్ కారక కణాల పెరుగుదలను నిరోధిస్తాయి.ఆవపిండి ఎముకలకు కూడా చాలా మేలు చేస్తుంది.ఆవ‌పొండిలోని సెలీనియం కంటెంట్‌ ఎముకలను బలంగా చేస్తుంది.గోర్లు, జుట్టు మరియు దంతాలను బలోపేతం చేయడానికి కూడా సహాయపడతాయి.ఆవపిండిలో యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మెండుగా ఉంటాయి.

ఇవి చిగుళ్ళు, ఎముకలు మరియు దంతాలలో నొప్పిని తగ్గించడంలో తోడ్ప‌డ‌తాయి.గట్ ఆరోగ్యాన్ని మరియు ప్రేగు కదలికను మెరుగుప‌రిచే స‌త్తా ఆవాల‌కు ఉంది.

అంతేకాదు శరీరంలో కాల్షియం ను తిరిగి నింపడంలో ఆవాలు హెల్ప్ చేస్తాయి.ఆవాల్లో విట‌మిన్ ఎ, విట‌మిన్ కె మ‌రియు విట‌మిన్ సి స్కిన్ ఏజింగ్ ను ఆల‌స్యం చేస్తాయి.

చ‌ర్మాన్ని య‌వ్వ‌నంగా మెరిపిస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube