సినిమా ఇండస్ట్రీలో డబ్బే ప్రధానంగా చాలా మంది పనిచేస్తూ ఉంటారు.కానీ డబ్బు కాదు విలువలు కూడా చాలా ముఖ్యం అని మరి కొంత మంది ఉంటారు.
డబ్బు ఇస్తే ఏ పనైనా చేసేవారు లేకపోలేదు.కానీ తీసుకునే ప్రతి రూపాయి కూడా కష్టంతో కూడిన పని కావాలని, అంతేకాదు ఇష్టంతో కూడా చేయాలని అనుకునే వారు కూడా ఉన్నారు.
అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని కోట్లు ఇచ్చినా కూడా కొంతమంది హీరోలు వారికి నచ్చని పని చేయరు.ఇంతకి ఆ హీరోలు ఎవరు ? ఎందుకు ఆ పనులు చేయడానికి ఒప్పుకోవడం లేదు అనే విషయాలను ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
మహేష్ బాబు

మహేష్ బాబు( Mahesh Babu ) చాలా ఏళ్ల నుంచి బాలీవుడ్ ఆఫర్స్ ని రిజెక్ట్ చేస్తూ వస్తున్నారు.ఎన్ని వందల కోట్లు పారితోషకం గా ఇచ్చినా సరే తాను తెలుగు సినిమాలు వదిలేసి హిందీలోకి వెళ్లే ప్రసక్తే లేదు అంటున్నారు.ప్రస్తుతం రాజమౌళితో సినిమా పూర్తిగా తెలుగు నేపథ్యంలోనే నిర్మాణం జరుపుకుంటుంది.
ప్రభాస్

బాహుబలి సినిమా విజయవంతమైన తర్వాత ప్రభాస్ కి( Prabhas ) నేషనల్ వైడ్ గా చాలా మంచి గుర్తింపు వచ్చింది.అందుకోసమే నేషనల్ బ్రాండ్స్ కొన్ని వందల కోట్లు ఆఫర్ చేసిన కూడా ఒక ఆడ్ షూట్ తీయడానికి ఆయన ఒప్పుకోవడం లేదు.ప్రభాస్ మొదటి నుంచి బ్రాండ్స్ లేదా ఆడ్స్ అసలు చేయరు.
జూనియర్ ఎన్టీఆర్

జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) తన తాత పోలికలతో ఉన్నాడు అని అందరూ అంటూ ఉంటారు.సీనియర్ ఎన్టీఆర్ లాగానే నటనలోనూ ఆహార్యంలోనూ ఏమాత్రం తీసిపోరు.ఆయన పోలికలు వచ్చిన మనవడు గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది.అయితే చాలాసార్లు ఎన్టీఆర్ పాత్రను పోషించాలంటూ ఆఫర్ వచ్చినా అందుకు తాను అర్హుడు నీ కాదు అంటూ రిజెక్ట్ చేస్తూ వస్తున్నారు.
శోభన్ బాబు

చచ్చే వరకు హీరో గానే అందగాడిగా ఉండాలి అనుకున్నారు శోభన్ బాబు.( Sobhan Babu ) అందుకని ఎంత డబ్బు ఇచ్చినా సరే సైడ్ పాత్రలు చేయడానికి ఇష్టపడలేదు.సినిమాల్లో నటించేటప్పుడు హీరో గానే చేశారు.కాస్త వయసు మీద పడగానే రిటైర్మెంట్ ఇచ్చేశారు.అంతేకానీ డబ్బుల కోసం సైడ్ క్యారెక్టర్స్ లేదా వయసు పైబడిన క్యారెక్టర్స్ చేయలేదు.







