జలుబు విపరీతంగా వేధిస్తుందా? ఇలా చేస్తే రెండు రోజుల్లో పరార్ అవుతుంది!

సీజన్ తో పని లేకుండా వేధించే సర్వసాధారణమైన సమస్యల్లో జలుబు ( cold )ఒకటి.ఒక్కోసారి జలుబు పట్టుకుంది అంటే అంత సులభంగా వదిలిపెట్టదు.

 How To Get Rid Of Cold Within Two Days , Cold, Latest News, Health, Health Tips,-TeluguStop.com

పైగా ఇంట్లో ఒకరికి జలుబు వచ్చిందంటే మిగతా వారికి కూడా సులభంగా పాకేస్తుంటుంది.ఈ క్రమంలోనే జలుబు నుంచి విముక్తి పొందడం కోసం మందులు వాడుతుంటారు.

కానీ ఇప్పుడు చెప్పబోయే హెర్బల్ వాటర్( Herbal water ) ను తీసుకుంటే రెండు రోజుల్లోనే జలుబు పరార్ అవుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం జలుబును తరిమికొట్టే ఆ హెర్బల్ వాటర్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒకటిన్నర గ్లాసుల వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే వన్ టేబుల్ స్పూన్ తరిగిన అల్లం ముక్కలు,( ginger ) వన్ టేబుల్ స్పూన్ తరిగిన వెల్లుల్లి ముక్కలు( Garlic slices ) వేసుకోవాలి.

అలాగే అంగుళం దాల్చిన చెక్క, రెండు లెమన్ స్లైసెస్ వేసుకోవాలి.చివరిగా కొన్ని ఎండిన ఆరెంజ్ తొక్కలు( Orange peels ) వేసి ప‌ది నుంచి ప‌న్నెండు నిమిషాల పాటు మరిగించాలి.

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరిగించిన వాటర్ ను స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి.

ఈ హెర్బల్ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ తేనెను కలిపి నేరుగా సేవించాలి.రోజుకు రెండు సార్లు ఈ హెర్బల్ వాటర్ ను తీసుకుంటే అందులో ఉండే యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ జలుబును చాలా వేగంగా తరిమి కొడతాయి.దగ్గు, గొంతు నొప్పి, గొంతు వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉన్నా సరే వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది.

అలాగే ఈ హెర్బల్ వాటర్ ను తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ సిస్టం బూస్ట్ అవుతుంది.వెయిట్ లాస్ అవుతారు.డిప్రెషన్, ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలు దూరం అవుతాయి.మైండ్ రిఫ్రెష్ అవుతుంది.కాబట్టి ఎవరైతే జలుబు సమస్యతో తీవ్రంగా బాధపడుతున్నారో వారు తప్పకుండా ఈ హెర్బల్ వాటర్ ను డైట్ లో చేర్చుకునేందుకు ప్రయత్నించండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube