సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోలు అందరూ కూడా రీల్ లైఫ్ లో మాత్రమే హీరోలుగా పని చేస్తారు కానీ వారు రియల్ లైఫ్ కి వచ్చేసరికి హీరోయిజం అస్సలు కనిపించదు.ఏదైనా విపత్తులు సంభవించినా లేదంటే స్పందించాల్సిన సమయం వచ్చినా కూడా 99 శాతం మంది హీరోలు తమకు ఏం సంబంధం అన్నట్టుగానే వ్యవహరిస్తారు.వారికి సామాజిక బాధ్యత, స్పృహ ఏవి ఉండవు.ఈ మధ్య కాలంలో కాస్త పరవాలేదు కానీ కాస్త వెనక్కి వెళితే నూటికో కోటికో ఒక్కరు జనాల కోసం ప్రేక్షకుల కోసం ఏదైనా చేశారు కానీ మిగతా వారు అంతా కూడా వారి జీవితం వారి కెరియర్ పై మాత్రమే ఫోకస్ చేసి కోట్లు కూడగట్టారు.
అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈతరం హీరోలలో ఒక ఇద్దరు హీరోల గురించి వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి.ఎందుకంటే వీరు మిగతా హీరోలు లాగా కాదు ఏదైనా సమస్య వచ్చింది అంటే ఇట్టే స్పందిస్తారు సోషల్ మీడియా సాక్షిగా ఎండ గట్టేస్తారు.డబ్బు, ధర్పం వీరికి అవసరం లేదు.సామాజిక బాధ్యత తెలిసిన వ్యక్తులుగా రియల్ లైఫ్ హీరోలుగా వీరిని చాలామంది కొనియాడుతున్నారు.ఇంతకీ ఆ ఇద్దరు హీరోలు ఎవరు అంటే ఒకరు సాయి ధరం తేజ్ ( Sai Daram Tej )అయితే మరొకరు మంచు మనోజ్( Manchu Manoj ).సాయి ధరమ్ తేజ్ ఇటీవల సోషల్ మీడియాలో తండ్రీ కూతుర్ల వ్యవహారంలో ఒక యూట్యూబర్ చేసిన తప్పును ట్వీట్ చేసి అందరికీ తెలిసేలా చేయడంతో సదర్ యూట్యూబర్ అరెస్ట అయ్యాడు .సమాజానికి చీడపురుగులా తయారవుతున్న వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి అంటూ సాయి ధరంతేజ్ చాలా రోజులుగా మాట్లాడుతున్నాడు.
ఇక మంచు మనోజ్ సైతం ప్రతిసారి తనదైన రీతిలో సోషల్ మీడియాలో స్పందిస్తూనే ఉంటాడు.లోపల ఒకలా బయట మరోలా ఉండే వ్యక్తిత్వం కాదు మనోజ్ ది.అందుకే మంచు మనోజ్ సినిమాల విషయంలో కూడా అందరికన్నా వెనకబడ్డాడు.ఎలాంటి చిన్న ఇన్సిడెంట్ జరిగిన తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ అవేర్నెస్ క్రియేట్ చేసే పనిలో ఉంటాడు.ఇది నాకెందుకులే అనే మనస్తత్వం కాదు ఆయనది.ఇలా ఈ ఇద్దరు హీరోలు రియల్ లైఫ్ లో రియల్ లైఫ్ లో హీరోలుగా అందరి చేత గుర్తింపబడుతున్నారు.