అలా చేసుంటే దేవరకు రూ.1000 కోట్ల కలెక్షన్లు వచ్చేవట.. పరూచూరి కామెంట్స్ వైరల్!

ఎన్టీఆర్(NTR) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ దేవర.కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ మూవీ విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికి తెలిసిందే.

 Paruchuri Gopala Krishna About Devara Part 1 Movie, Paruchuri Gopala Krishna, De-TeluguStop.com

జాన్వీ కపూర్ (Janhvi Kapoor)హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ఇంకా చాలామంది నటీనటులు నటించిన విషయం తెలిసిందే.ఈ సినిమా విడుదల అయ్యి కోట్లలో కలెక్షన్స్ ని సాధించింది.

ప్రస్తుతం మూవీ మేకర్స్ ఈ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాపై రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

పరుచూరి (Paruchuri)పాఠాలు పేరుతో తన యూట్యూబ్‌ ఛానల్‌ వేదికగా ఆ చిత్రాన్ని విశ్లేషించారు.

సెప్టెంబరులో థియేటర్లలో విడుదలై ప్రస్తుతం ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్‌ అవుతోన్న దేవర(devara ) గురించి పరుచూరి పంచుకున్న విశేషాలు ఆయన మాటల్లోనే తెలుసు కుందాం.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR)తర్వాత సోలో హీరోగా ఎన్టీఆర్‌ దేవర సినిమాను(NTR Devara Movie) ప్రకటించగానే ఎలాంటి కథలో నటిస్తాడోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు.

దర్శకుడు కొరటాల శివ తీసిన గత సినిమా ఇచ్చిన ఫలితాన్ని కూడా అభిమానులు పరిగణనలోకి తీసుకుంటారు.అలా అనుకోవడం అన్నిసార్లు కరెక్ట్‌ కాదు.మేం కూడా ఎన్నో గొప్ప విజయాలు చూశాము.అదే స్థాయిలో పరాజయాలు ఎదుర్కొన్నాము.

దానికి ఎవరినీ నిందించలేం.

Telugu Devara, Janhvi Kapoor, Paruchurigopala, Tollywood-Movie

ఈ సినిమా విషయంలో మెచ్చుకోవాల్సిన అంశాలు సినిమాటోగ్రఫీ, సంగీతం.ఇందులో మ్యూజిక్‌ బాగుంది గానీ ఎన్టీఆర్‌ (NTR)స్థాయికి తగ్గట్టు లేదనేది నా అభిప్రాయం.సినిమా విడుదలైన సమయంలో రచయితలతో మాట్లాడినప్పుడు కొందరు బాగోలేదని చెప్పారు.

కొందరు యావరేజ్ అన్నారు.మరికొందరు చాలా బాగుందని అన్నారు.

ఇలా మిశ్రమ స్పందన వచ్చిన సినిమా విజయవంతంగా ప్రదర్శితమవ్వాలంటే బలమైన హీరో ఉండాలి.మా చిన్న రామయ్య అలాంటి వారిలో ఒకడు.

క్లుప్తంగా ఇది సముద్రపు దొంగల కథ.అలాంటి ఓజా దొంగ మంచి వాడిగా మారిన తర్వాత ఏమైంది? అన్నది కీలకం.ఈ చిన్న పాయింట్‌ ఆధారంగా ఎక్కువ నిడివితో సినిమాని తెరకెక్కించడం జోక్‌ కాదు.పైగా ఎక్కువ సన్నివేశాల్లో సముద్రాలకు సంబంధించినవే.కొరటాల శివ స్క్రీన్‌ప్లే మాస్టర్‌ అనిపించుకున్నాడు.నిజంగా జరిగిన కథే అనిపించేలా మాయ చేశాడు.

ఇది ఎన్టీఆర్‌ బాడీ లాంగ్వేజ్‌కు సరిపోదని మొదట నేను అనుకున్నా.కానీ ఇది ఎన్టీఆర్‌ బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయేలా తీసి, విజయం అందుకోవడం మామూలు విషయం కాదు.

Telugu Devara, Janhvi Kapoor, Paruchurigopala, Tollywood-Movie

ఈ స్టోరీని హాలీవుడ్‌ లో అయితే సూపర్‌ అంటారు.తండ్రి ప్రతీకారాన్ని తీర్చుకునే తనయుడి కథ అని ప్రేక్షకుడు అనుకునేలా శివ తీర్చిదిద్దాడు.కథ తెలిసినా కథనం గొప్పగా ఉంటే సినిమాలు విజయం అందుకుంటాయనడానికి ఇదొక ఉదాహరణ.ఎన్టీఆర్ నటన సహజంగా ఉంది.ట్విస్టులు బాగున్నాయి.అయితే, ఫస్టాఫ్‌లో దేవర పాత్ర ఫ్లాష్‌బ్యాక్‌ ను పూర్తిగా చూపించడానికి బదులు కొంత చూపించి దేవర కొడుకు, హీరోయిన్‌తో అతడి రొమాంటిక్‌ సన్నివేశాలు, వినోదాత్మక సీన్స్‌ను పెట్టి ఉండుంటే ఈ సినిమా రూ.1000 కోట్లు దాటేసి ఉండేదని నా విశ్వాసం అని తెలిపారు గోపాల కృష్ణ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube