దగ్గర ప్రాంతాలకు అయినా సుదూర ప్రాంతాలకు అయినా చాలామంది ప్రయాణానికి ఉపయోగించే వాహనం బస్సులే.మామూలుగా ఆర్టీసీ బస్సులో( RTC bus ) ప్రయాణికులు బిజీ సమయాలలో కిక్కిరిసి ప్రయాణం చేయడం మనం చూస్తూనే ఉంటాం.
కనీసం కూర్చోవడానికి కూడా స్థలం లేకుండా ఉంటుంది.అలాంటి సమయంలో ప్రయాణికులు వారితోపాటు తెచ్చుకున్న లగేజ్ ని బస్సులో ఏదో ఒక మూలన పెట్టి నిల్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు.
ఇలాంటి సమయంలోనే తరచుగా ప్రయాణికుల వస్తువులను దొంగతనాలకు గురవుతూ ఉంటాయి.అయితే సమాజంలో కొందరు ఇంకా మానవతా దృక్పథంతో జీవిస్తూ ఉంటారు.
అలాంటి హృదయం కలిగిన కండక్టర్లు, బస్సు డ్రైవర్లు( Bus drivers ) నిజాయితీగా ప్రయాణికుల వస్తువులను డిపో డిఎం లేదా సమీప పోలీస్ స్టేషన్లో అప్పగించి ప్రయాణికులకు అందజేస్తుంటారు.అయితే తాజాగా జరిగిన ఘటన కాస్త భిన్నంగా జరిగింది.
ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ వీడియోలో ఆర్టీసీ బస్సు వరంగల్ ( RTC Bus Warangal )నుండి నిజామాబాదుకు వెళ్తుంది.ఈ ప్రయాణంలో మహిళ తన బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగును డ్రైవర్ సీట్ వెనకాల భద్రంగా పెట్టింది.అయితే అందులో బంగారం ఆభరణాలు ఉన్నాయో లేవో తెలియదు కానీ బస్సు నడుపుతున్న డ్రైవర్ బ్యాగుపై కన్ను వేశాడు.
ఆ తర్వాత డ్రైవర్ ఎవరు చూడట్లేదు అని చెప్పి బ్యాగులోని బంగారు ఆభరణాలను సైలెంట్ గా నొక్కేసాడు.

ఈతంగాన్ని మొత్తం అక్కడే ఉన్న ఓ ప్రయాణికు డు సైలెంట్ గా వీడియో తీశాడు.ఆ తర్వాత విషయాన్ని సదరు మహిళలకు చెప్పడంతో డ్రైవర్ను నిలదీశారు.దాంతో ఆ డ్రైవర్ వస్తువుల కింద పడిన సమయంలో తాను తీశానని బుకాయించడానికి ప్రయత్నం చేయగా.
అతడు చేసిన పని సంబంధించిన వీడియోని ఆయనకు చూపించడంతో అసలు నిజాన్ని ఒప్పుకున్నా డు.ఈ వీడియోని కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది.ఈ వీడియోని చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఆ డ్రైవర్ పై ఆర్టీసీ యాజమాన్యం వారు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.ఏది ఏమైనా.ప్రయాణికుల క్షేమం కోరుకోవాల్సిన డ్రైవర్ ఇలా ప్రవర్తించిన తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.







