ఎంత డబ్బు కావాలో చెప్పు.. ప్రభాస్ పై మంచు లక్ష్మి షాకింగ్ కామెంట్స్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగిన ప్రభాస్( Prabhas ) ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.ఇలా నటుడుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు పొందిన ఈయన ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

 Manchu Lakshmi Interesting Comments On Prabhas Details, Manchu Lakshmi, Prabhas,-TeluguStop.com

ఇక ప్రభాస్ తన సినిమాలతో పాటు మంచు విష్ణు ( Vishnu ) డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప ( Kannappa ) సినిమాలో శివుడి పాత్రలో నటించబోతున్న విషయం తెలిసిందే.అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా మంచు లక్ష్మీ( Manchu Lakshmi ) ప్రభాస్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Telugu Kannappa, Manchu Lakshmi, Manchu Vishnu, Mohan Babu, Prabhas, Prabhasmanc

నిజానికి మంచు కుటుంబానికి ప్రభాస్ కి మధ్య ఎంతో మంచి బాండింగ్ ఉంది.ప్రభాస్ హీరోగా నటించిన బుజ్జిగాడు సినిమాలో హీరోయిన్ త్రిషకు అన్నయ్య పాత్రలో మోహన్ బాబు( Mohan Babu ) నటించారు.ఆ సమయంలో మోహన్ బాబుని ప్రభాస్ బావ అని పిలుస్తూ ఉండేవారు.అప్పటినుంచి వీరిద్దరి మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంది.ఇప్పటికీ కూడా ప్రభాస్ మోహన్ బాబు తరచూ ఫోన్లో మాట్లాడుతూ ఉంటారని మంచు లక్ష్మి వెల్లడించారు.

Telugu Kannappa, Manchu Lakshmi, Manchu Vishnu, Mohan Babu, Prabhas, Prabhasmanc

ఇక ప్రభాస్ మా కుటుంబం కోసం ఏం అడిగినా కాదనరని మంచు లక్ష్మి తెలియచేశారు.ఈ క్రమంలోనే ఓ రోజు తాను ప్రభాస్ తో మాట్లాడుతూ తాను టీచ్ ఫర్ చేంజ్( Teach For Change ) అనే సంస్థను ఏర్పాటు చేసినట్లు తెలియజేయడంతో వెంటనే ప్రభాస్ మాట్లాడుతూ ఈ సంస్థ కోసం ఎంత డబ్బు కావాలో చెప్పు అంటూ నన్ను అడిగారు.ఇక తాను డబ్బు కోసం అడగలేదని కేవలం మీ సోషల్ మీడియాలో ఈ సమస్థ గురించి ఒక్క పోస్ట్ పెడితే చాలు అని ప్రభాస్ ని కోరాను ఇలా చెప్పిన వెంటనే ప్రభాస్ ఆ పని చేసి పెట్టారు అంటూ మంచు లక్ష్మి ప్రభాస్ గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube