ప్రణవ్ మోహన్ లాల్.( Pranav Mohanlal ) మలయాళీ స్టార్ హీరో ( Mohanlal ) తనయుడు.
చైల్డ్ ఆర్టిస్ట్ గానే మొదలు పెట్టి, అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసి, హీరోగా కూడా మారాడు.అలాగే ఇతను నటించిన హృదయం సినిమా మలయాళంలోనే కాకుండా ఓటీటీలో కూడా మంచి హిట్ గా నిలిచింది.
ఈ మధ్యనే వర్షంగళకు శేషం అనే సినిమాలో కూడా నటించాడు.మోహన్ లాల్, శ్రీనివాసన్ లది మలయాళంలో హిట్ పెయిర్ అని చెప్పాలి.
మోహన్ లాల్ హీరోగా నటించిన అనేక సినిమాలకు శ్రీనివాసన్ రచన, దర్శకత్వం చేశాడు.
శ్రీనివాసన్ తనయుడు వినీత్ శ్రీనివాసన్ దర్శకత్వంలో హృదయం, వర్షంగళకు శేషం వంటి సినిమాలు వచ్చాయి.ఆ సంగతి పక్కన పెడితే ప్రణవ్ మోహన్ లాల్ ప్రస్తుతం గ్యాప్ తీసుకున్నాడట.ఈ గ్యాప్ లో అతడు స్పెయిన్ లో( Spain ) ఉన్నాడట.
మరి స్టార్ హీరో తనయుడు, తను కూడా హీరో కాబట్టి ఏ విహారానికో, అక్కడి హై క్లాస్ లైఫ్ ను ఎంజాయ్ చేయడానికో ఇతడు ఆ యూరోపియన్ కంట్రీలో ఉండటం లేదట.అక్కడ ఒక ఫామ్ లో ఇతడు పని చేస్తూ ఉన్నాడట.
అది కూడా ఒకరకమైన కూలి పని.( Labor Work )
గొర్రెలు కాయడం, గుర్రాలను చూసుకోవడం వంటి పనులు చేస్తున్నాడట.ఇందుకు గానూ జీతం కూడా ఏమీ లేదని, కేవలం భోజనం పెట్టి, ఆ ఫామ్ లోనే షెల్టర్ ఇస్తారని ప్రణవ్ తల్లి ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.ప్రణవ్ అలా కూలి పనిలాంటి పని చేసుకుంటున్నాడని, అది అతడి ఇష్టమని ఆమె చెప్పింది.
తనైతే అతడు వీలైనన్ని సినిమాలు చేయాలని కోరుకుంటానని ఆమె చెప్పుకొచ్చారు.విరామం తీసుకుని ఇలా స్పెయిన్ లో అతడు వ్యవసాయ కూలీ తరహాలో పని చేస్తున్నాడని, ఈ పనులను అతడు ఆస్వాదిస్తున్నాడని ఆమె తెలిపారు.
మరి స్టార్ హీరోల తనయులు అంటే అంతా ఒకలా ఉండరనేందుకు ప్రణవ్ తీరు చాటుతూ ఉంది.