యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్( Civils ) పరీక్షలకు ఉండే పోటీ అంతాఇంతా కాదు.ఈ పరీక్షల్లో సక్సెస్ కావాలంటే మూడు దశలు దాటాల్సి ఉంటుంది.
నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి( Nalgonda Collector Ila Tripathi ) సక్సెస్ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.ఆమె సక్సెస్ స్టోరీకి( Success Story ) నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
యూపీలోని లక్నోలో జన్మించిన త్రిపాఠి తండ్రి యూపీ క్యాడర్ లో ఫారెస్ట్ సర్వీస్ లో పని చేశారని చెప్పారు.ఆ తర్వాత డిప్యుటేషన్ పై కర్ణాటకలో పని చేశారని వెల్లడించారు.
ఏం చదువుకుంటే ప్రజలకు సేవ చేయవచ్చని నాన్నను అడగగా కలెక్టర్ అని చెప్పేవారని నాన్నను స్పూర్తిగా తీసుకుని చదువుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు.2013 సంవత్సరంలో ఢిల్లీలోని జేపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ పూర్తి చేశానని ఆమె వెల్లడించారు.ఆ తర్వాత లండన్ కు వెళ్లానని ఆమె తెలిపారు.అక్కడ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో ఏడాది చదువుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు.
నా చదువు పూర్తైన వెంటనే జాబ్ వచ్చిందని రెండున్నర సంవత్సరాల పాటు ఈక్విటీ బ్యాంక్ లో ఫైనాన్షియల్ కన్సల్టెంట్ గా చేశానని ఆమె తెలిపారు.జాబ్ చేస్తూనే సివిల్స్ కు ప్రిపేర్ అయ్యి రెండో ప్రయత్నంలో లక్ష్యాన్ని సాధించానని ఇలా త్రిపాఠి( Collector Ila Tripathi ) అన్నారు.నా భర్తది ఢిల్లీ అని తను నాకంటే రెండేళ్లు సీనియర్ అని ఆమె చెప్పుకొచ్చారు.మాది ప్రేమ వివాహం అని మాకు ఒక బాబు ఉన్నాడని ఆమె చెప్పుకొచ్చారు.
మహిళలు స్వయం సమృద్ధి సాధించాలన్నది నా లక్ష్యమని ఇలా త్రిపాఠి వెల్లడించారు.ములుగులో 13 రకాల పోషక ధాన్యాలతో పోషణ్ పోట్లీ అనే కార్యక్రమంను అమలులోకి తెచ్చానని ఆమె తెలిపారు.
నాకు కుక్క పిల్లలంటే చాలా ఇష్టమని మా ఇంట్లో స్నోయి ఉంటుందని ఇలా త్రిపాఠి చెప్పుకొచ్చారు.ఇలా త్రిపాఠి వెల్లడించిన విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.