సాధారణ జనం నుంచి ప్రముఖుల వరకు గత కొద్ది ఏళ్లుగా అతి తక్కువ వయస్సులోనే గుండెపోటుకు గురై ఆకస్మికంగా మరణిస్తున్నారు.దీనికి కారణాలు.
వైద్యులు ఇస్తున్న సలహాలు ఏంటో తెలుసుకుందాం.ప్రముఖ హిందీ సీరియల్ నటుడు, బిగ్ బాస్ 13 విజేత సిద్ధార్థ శుఖ్లా (40) గురువారం ముంబై కూపర్ ఆస్పత్రిలో గుండెపోటుతో హఠాన్మరణం చెందారు.
దీంతో దేశవ్యాప్తంగా ఉన్న అతని అభిమానులకు ఈ విషయం కలచివేసింది.అయితే, ఆయన మరణానికి కారణం గుండెపోటని తేలింది.
ప్రముఖ వైద్యులు ఇలా చాలా మందిలో చిన్న వయస్సులోనే గుండెపోటుకు గురవుతున్నందుకు కారణాలను, పరిష్కారాలను తెలియజేశారు.దీనిపై గ్రేటర్ నొయిడా శ్రద్ధా ఆస్పత్రికి చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ సుభేందు మోహంతి కార్డిక్ అరెస్ట్ గురించి ఓ ప్రముఖ దినపత్రికతో షేర్ చేసుకున్నారు.
గడిచిన 10–15 ఏళ్లతో పోలిస్తే.రెండేళ్లుగా 18 నుంచి 20 ఏజ్ గ్రూప్‌లలో కూడా హార్ట్ అటాక్ సాధారణమైంది.
గుండెపోటుకు ప్రధాన కారణాలు…
ముఖ్యంగా గుండెపోటు ధూమపానం ఎక్కువగా పీల్చేవారిలో వస్తుందని వైద్యులు తెలిపారు.రెండోది ఎక్కువగా మానసిక ఒత్తిడి ఉన్నవారిలో.
అందుకే ప్రముఖుల ఎక్కువ శాతం దీని బారిన పడుతున్నారు.ఆ తర్వాత ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం.
కొంతమంది ఫిట్నెస్ కోసం స్టెరాయిడ్స్ అధికంగా తీసుకుంటారు.ఇది కూడా హార్ట్ అటాక్‌కు దారితీస్తుంది.
కానీ, వీటివల్ల ఇప్పటి వరకు ఎక్కువ కేసులు నమోదు కాలేదు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
మీరు ఒకవేళ డయాబెటీస్ లేదా హై బీపీ, కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నట్టయితే.వైద్యుల సహాకారంతో వాటిని నియంత్రణలో ఉంచుకోవాలి.ఆరోగ్యంగా ఉండి ఏ రోగాలు లేకుండా ఉంటే.కొన్ని వైద్యుడి నియమాలను పాటించాల్సి ఉంటుంది.ప్రతిరోజూ ఎక్సర్‌సైజ్ 30–45 నిమిషాల వరకు కనీసం వారంలో ఐదు రోజులపాటు చేయాలి.ముఖ్యంగా కార్డియో ఎక్సర్‌సైజ్.
సైక్లింగ్, రన్నింగ్, స్విమ్మింగ్ వంటివి గుండెకు మేలును చేస్తాయని డాక్టర్‌లు సూచిస్తున్నారు.కానీ, అధిక బరువులను మోసే ఎక్సర్‌సైజ్‌లతో ఏ ఉపయోగం ఉండదని చెబుతున్నారు.5 కిలోల బరువుతో ఎక్సర్‌సైజ్ చేసుకోవచ్చు.ఎక్కువ బరువతుతో మీ కండరాలు దృఢంగా అవుతాయి కానీ, అది గుండెపై ప్రెజర్‌ను పెంచుతాయి.
అప్పుడప్పుడు పనుల్లో విరామం తీసుకుని, ఫ్యామిలీ లేదా స్నేహితులతో సమయాన్ని గడపాలి.
అంతేకానీ, టీవీలు చూస్తే మాత్రం అది విరామంలోకి రాదని గుర్తుపెట్టుకోండి.ఎందుకంటే వాటిని చూస్తూ కూడా ఆలోచనలు చేస్తూనే ఉంటాం.పొగ తాగటం పూర్తిగా మానివేయాలి.
రోజుకు ఒక్క సిగరేట్ తాగినా.గుండెపోటుకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని గుర్తుంచుకోండి.
మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలి.ప్రతిరోజూ 250–200 గ్రాముల పచ్చి కూరగాయలు, పళ్లను మీ డైట్‌లో భాగం చేసుకోవాలి.
ఉప్పు వినియోగం కూడా తగ్గించుకోవాలి.సాఫ్ట్ డ్రింక్స్‌ను పూర్తిగా మానేయాలి.
ఈ నియమాలను మీరు కచ్చితంగా పాటిస్తే 95–98 శాతం సేఫ్‌గా ఉన్నట్టేనని డాక్టర్లు పెర్కొంటున్నారు.