భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ పాడిన జానపద కళాకారుడు ఎవరో తెలుసా?

పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ లో ఎక్కువ రీమేక్ సినిమాలలో నటించినా ఆ సినిమాలలో కొన్ని సినిమాలు ఒరిజినల్ ను మించి తెలుగులో సక్సెస్ సాధించాయి.భీమ్లా నాయక్ మేకర్స్ ఇప్పటికే ఫస్ట్ గ్లింప్స్ తో సినిమాపై అంచనాలు పెంచగా తాజాగా రిలీజ్ చేసిన టైటిల్ సాంగ్ తో ఆ అంచనాలు మరింత పెరిగేలా చేశారు.

 Darshanam Mogulaiah Sing A Song In Bheemla Naik Title Song,latest Tollywood New-TeluguStop.com

టైటిల్ సాంగ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు విపరీతంగా నచ్చేయగా కొంతమంది మాత్రం పాటపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

Telugu Bheemla Naik, Mogulaih-Movie

వ్యూస్, లైక్స్ పరంగా భీమ్లా నాయక్ కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుండగా టైటిల్ సాంగ్ సాకి పడిన జానపద కళాకారుడి గొంతు పాటకు ప్రాణం పోసింది.సాకీ పడిన వ్యక్తి ప్రముఖ తెలంగాణ జానపద గాయకులలో ఒకరైన మొగులయ్య కావడం గమనార్హం.ఈ జానపద కళాకారుడు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అచ్చంపేట మండలంలోని లింగాల గ్రామానికి చెందిన వారు.12 మెట్ల కిన్నెరను తండ్రి నుంచి నేర్చుకున్న మొగులయ్య తండ్రి నుంచి నేర్చుకున్న కళను వేదికలపై ప్రదర్శిస్తూ మంచి పేరును సొంతం చేసుకున్నారు.

తండ్రి ఏడు మెట్ల కిన్నెరను నేర్పించగా మొగులయ్య సొంతంగా 12 మెట్ల కిన్నెరను తయారు చేశారు.

పాలమూరు జిల్లాకు చెందిన రాజులతో పాటు ప్రముఖుల వీరగాథలను మొగులయ్య రోమాలు నిక్కబొడుచుకునే విధంగా కథలుగా చెప్పేవారు.మొగులయ్య యొక్క కళను మెచ్చి ఎవరైనా సహాయం చేస్తే ఆ సహాయంతో మొగులయ్య జీవనం సాగించేవారు.

ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన స్కాలర్ ఒకరు మొగులయ్య కథను వెలుగులోకి తెచ్చారు.

Telugu Bheemla Naik, Mogulaih-Movie

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మొగులయ్యను ఆదుకోవడంతో పాటు నెలకు 10,000 రూపాయల చొప్పున మొగులయ్యకు పెన్షన్ ను మంజూరు చేస్తోంది.భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ ద్వారా మొగులయ్య పేరు మారుమ్రోగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube