తాజాగా అక్కినేని అభిమానులకు హీరో నాగార్జున ( Hero Nagarjuna )ఊహించని షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే.త్వరలో హీరో నాగ చైతన్య( Naga Chaitanya ) పెళ్లి కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే.
హీరోయిన్ శోభిత ధూళిపాలను వచ్చే నెల అనగా డిసెంబర్ 4వ తేదీన పెళ్లి చేసుకోబోతున్నారు.ఇక ప్రేక్షకులు అభిమానులు ఆ సందర్భం కోసం ఎదురు చూస్తుండగా తాజాగా నాగార్జున తన చిన్న కొడుకు అఖిల్ అక్కినేని నిశ్చితార్థం చేసి ఒక్కసారిగా ఊహించని షాక్ ఇచ్చారు.
నిజంగా ఇది ఆశ్చర్యం షాకింగ్ అని చెప్పాలి.

గతంలో అఖిల్ నిశ్చితార్ధం జరగగానే నాగ చైతన్య,సమంత ( Naga Chaitanya, Samantha )ల పెళ్లి జరిగిన విషయం తెలిసిందే.అప్పుడా ఎంగేజ్మెంట్, ఆ పెళ్లి రెండు బ్రేక్ అయ్యాయి.అయితే ఇప్పుడు కూడా అఖిల్ నిశ్సితార్ధం అవ్వగానే నాగ చైతన్య శోభిత మెడలో మూడు ముళ్ళు వెయ్యబోతున్నాడు.
అయితే నిన్న మంగళవారం అఖిల్ ( Akhil )నిశ్సితార్ధం జరిగినట్టుగా సింపుల్ గా ప్రకటించారు.పెళ్లి మాత్రం వచ్చే ఏడాది మార్చిలో ఉంటుంది అని తెలుస్తోంది.

నాగ చైతన్య పెళ్లి డిసెంబర్ 4 న హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్( Annapurna Studios ) లో జరగబోతోంది.చైతు శోభితల పెళ్లి హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ దక్కించుకున్నట్టుగా తెలుసస్తోంది.ఇక డిసెంబర్ లో పెద్ద కొడుకు చైతూ పెళ్లి చేయబోతున్న నాగార్జున వచ్చే ఏడాది మార్చి లో చిన్న కొడుకు అఖిల్ వివాహం చేయనున్నట్లుగా తెలుస్తోంది.అఖిల్, జైనాబ్ రావ్‌జీ పెళ్లిని దుబాయ్ వేదికగా ఇరు ఫ్యామిలీస్ జరిపించనున్నట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం ఇదే వార్త టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.