ఎన్ని చేసినా దగ్గు తగ్గడం లేదా.. అయితే ఇది తెలుసుకోండి!

దగ్గు( Cough ).పిల్లల నుంచి పెద్దల వరకు దాదాపు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఈ సమస్యను ఫేస్ చేసే ఉంటారు.

 Super Powerful Drink To Get Rid Of Cough Naturally!, Cough, Cough Relief Drink,-TeluguStop.com

అందులోనూ ప్రస్తుత చలికాలంలో ప్ర‌ధానంగా వేధించే సమస్యల్లో దగ్గు ముందు వరుసలో ఉంటుంది.దగ్గు చిన్న సమస్యే అయినప్పటికీ తీవ్ర సౌకర్యానికి గురిచేస్తుంది.

దగ్గు కారణంగా పనిపై ఏకాగ్రత దెబ్బతింటుంది.ఒక్కోసారి నాన్ స్టాప్ గా దగ్గు రావడం వల్ల రాత్రుళ్ళు సరిగ్గా నిద్ర కూడా పట్టదు.

ఈ క్రమంలోనే దగ్గును తగ్గించుకునేందుకు ముప్పతిప్పలు పడుతుంటారు.

Telugu Cough, Tips, Latest, Powerful-Telugu Health

అయితే ఎన్ని చేసినా దగ్గు తగ్గడం లేదా.? వర్రీ వ‌ద్దు ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ డ్రింక్ ను కనుక తాగితే ఎలాంటి దగ్గు అయినా సరే దెబ్బకు పరార్ అవుతుంది.ఈ డ్రింక్ తయారీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్‌ వాటర్ పోసుకోవాలి.

వాటర్ హీట్ అవ్వగానే అందులో పావు టేబుల్ స్పూన్ పసుపు, పావు టేబుల్ స్పూన్ అల్లం పొడి, చిటికెడు మిరియాల పొడి( Pepper Powder ) వేసి పది నుంచి ప‌న్నెండు నిమిషాల పాటు మరిగించాలి.

ఆ తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ తాటి బెల్లం పొడి, వన్ టేబుల్ స్పూన్ స్వచ్ఛమైన నెయ్యి మరియు చిటికెడు నల్ల ఉప్పు( Black Salt ) వేసి ఒక నిమిషం పాటు మరిగించాలి.

ఆపై స్టవ్ ఆఫ్ చేసి వాటర్ ను స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకుంటే మన డ్రింక్ సిద్ధం అయినట్టే.దగ్గుతో బాధపడుతున్న వారికి ఈ డ్రింక్ ఎంతో ఉత్తమంగా సహాయపడుతుంది.

ఈ డ్రింక్ లో యాంటీ ఆక్సిడెంట్స్ తో పాటు యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి.

Telugu Cough, Tips, Latest, Powerful-Telugu Health

ఇవి గొంతులోని ఇన్ఫెక్షన్( Throat Infection ) లకు వ్యతిరేకంగా పోరాడుతాయి.దగ్గు సమస్యను రెండు మూడు రోజుల్లోనే సమర్థవంతంగా తరిమికొడతాయి.కాబట్టి దగ్గుతో ఇబ్బంది పడుతున్న వారు తప్పక ఈ డ్రింక్ ను తయారు చేసుకుని తీసుకునేందుకు ప్రయత్నించండి.

పైగా ఈ డ్రింక్ ను రోజు తాగడం వల్ల జలుబు, గొంతు నొప్పి, గొంతు వాపు వంటి సమస్యలు దూరం అవుతాయి.అదే సమయంలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.

తలనొప్పి( Headache ) ఒత్తిడి వంటి మానసిక సమస్యలు ఏమైనా ఉంటే న‌యం అవుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube