బరువు తొందరగా తగ్గటానికి ఈ 10 చిట్కాలు చాలు

ప్రపంచాన్ని వణికిస్తున్న సమస్య ఉబకాయం.అధిక బరువు.

మనం తినేసేది తినేయాలి.జబ్బులు మటుకు రాకూడదు అంటే ఎలా.ఒక బెలూన్లో గాలి ఎంతవరకూ పడుతుంది.దాని సామర్ధ్యం ఉన్నంత వరకూ.

 10 Rules For Immediate Weight Loss-10 Rules For Immediate Weight Loss-Telugu Health-Telugu Tollywood Photo Image-TeluguStop.com

లేకపోతే పేలిపోతుంది.ఇదే సూత్రం మనకి వర్తించదా.

మనం తినే తిండి చాలా లిమిట్ గా ఉండాలి.అధిక మోతాదులో తింటే.

దాని ఫలితం అప్పటికప్పుడు చూపించక పోయినా దీర్ఘకాలికంగా తన ప్రభావాన్ని చుపిస్తుంది.ఇప్పుడు చాలా మంది బరువు తగ్గడం మీదనే దృష్టి పెడుతున్నారు.

వారు కొన్ని కొన్ని నియమాలు పాటిస్తే చాలు.కొన్ని పద్దతుల ద్వారా బరువుని తగ్గించుకోవచ్చు అని చెప్తున్నారు వైద్యులు.వీటిని పాటించడం ద్వారా తొందరగా బరువుని తగ్గించుకోవచ్చట.

1.మత్తు పదార్థాల వలన అదనపు కొవ్వు చేరి శరీర బరువు పెరుగుతుంది.దీంతో సమస్యలు తలెత్తుతాయి.

2.రోజుకు 6 నుంచి 8 గ్లాసుల నీటిని తీసుకోవడం వలన క్యాలరీ ఇన్‌టెక్ తగ్గుతుంది.శరీరంలో మాలిన్యాలు పేరుకుపోవు.ఇది బరువు తగ్గేందుకు దోహదపడుతుంది.

3 ఇంటి పరిశుభ్రత, గార్డెనింగ్ లాంటి పనుల వలన శరీరానికి తగిన వ్యాయామం జరుగుతుంది.

4.చాయ్, కాఫీ, కూల్‌డ్రింక్‌లు సేవించడం తగ్గించండి.వీటిలో షుగర్‌తో పాటు కనిపించని క్యాలరీలు అధికమోతాదులో ఉంటాయి.

5.ఉప్పువాడకాన్ని వీలైనంతవరకూ తగ్గించండి.ఉప్పువలన శరీరంలో నీరు అధికంగా చేరుతుంది.దీనికి బదులుగా పొటాషియం అధికంగా ఉండే పాలకూర, అరటి పండ్లు తీసుకోవడం ఉత్తమం.

6.రాత్రిపూట చాలాసేపు మేల్కొని ఉండటం మంచిదికాదు.నిద్రలేమి వలన బరువు పెరిగేందుకు అవకాశం ఉంది.6 నుంచి 8 గంటల పాటు నిద్రించాలి.

7.ఫైబర్, ప్రోటీన్లను అధికంగా తీసుకోవాలి.కార్బోహైడ్రేట్, కొవ్వు పదార్థాలను తగ్గించండి.గ్రీన్ వెజిటబుల్స్, సలాడ్లను తీసుకోండి.జంక్ ఫుడ్ జోలికి వెళ్లకండి.

8.ఒకేసారి అధికంగా ఆహారం తీసుకోవడం వలన బరువు పెరిగే అవకాశముంటుంది.అందుకే మూడు, నాలుగు గంటల తేడాతో కొద్దికొద్దిగా ఆహారం తీసుకోవడం ఉత్తమం.

9.కనీసం కొన్ని మెట్లయినా ఎక్కిదిగుతుండాలి.దీంతో ఫిజికల్ ఎక్సర్‌సైజ్ జరుగుతుంది.అధికంగా ఉన్న క్యాలరీలు బర్న్ అవుతాయి.బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపడుతుంది.

10.మైదా వస్తువులు దూరంగా ఉంచండి.షుగర్ మైదా కలిసినవి తింటే బరువు అధికంగా పెరుగుతారు.

అంతేకాదు కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ .వాల్నట్స్ .అవిసగింజలు వంటివాటిని రోజు ఉదయం సాయంత్రం తీసుకోవడం వలన కూడా బరువు క్రమంగా తగ్గుతారు.యోగా సాధన కూడా బరువు తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు