తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి.అయితే సంక్రాంతి అంటే మొదట గుర్తుకు వచ్చేది అరిసెలు.
సంక్రాంతి స్పెషల్ ఫుడ్ ఇది.దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో సంక్రాంతికి తప్పకుండా అరిసెలను వండుకుంటారు.వీటి తయారీలో బియ్యపు పిండి, బెల్లం, నూనె, నువ్వులు వాడతారు.ఇప్పుడు కాదు అమ్మమ్మల కాలం నుంచి అరిసెలు చాలా ఫేమస్.అయితే సంక్రాంతికి మాత్రమే అరిసెలను వండుతారు.ఎందుకు అనే డౌట్ చాలా మందికి ఉంటుంది.
సంక్రాంతి అంటే పంటల పండుగ.ఈ టైమ్ లోనే ధాన్యం చేతికి వస్తుంది.కానీ చేతికొచ్చిన ధాన్యాన్ని వాడుకోవడం కుదరదు.ఎందుకంటే కొత్త బియ్యం ఓ పట్టాన జీర్ణం కావు.
దాన్ని తినడం వల్ల కడుపు నొప్పి ఖాయం.ఇదే సమయంలో మార్కెట్లోకి వచ్చే బెల్లం పరిస్థితీ ఇంతే.
అందుకే కొత్త బియ్యాన్ని దంచి, దానికి కొత్త బెల్లాన్ని జోడించి అరిసెలు చేసుకుని తింటారు.రుచి పరంగా అరిసెలు అద్భుతం అనే చెప్పవచ్చు.
అందుకే పెద్దలు, పిల్లలు అనే తేడా లేకుండా అందరూ ఎంతో ఇష్టంగా అరిసెలను తింటుంటారు.అయితే అరిసెలు రుచి పరంగానే కాదు ఆరోగ్యానికి సైతం బోలెడన్ని లాభాలను అందిస్తుంది.
అరిసెల తయారీలో వాడే బెల్లం రక్తాన్ని శుద్ధి చేయడానికి అద్భుతంగా సహాయపడుతుంది.అలాగే బెల్లం శరీరంలో పేరుకుపోయిన వ్యర్ధాలు మలినాలు బయటకు తొలగిపోయేలా చేస్తుంది.శరీరాన్ని శుభ్రంగా మారుస్తుంది.ప్రస్తుతం చలికాలం అన్న సంగతి తెలిసిందే.చలి పులిని తట్టుకోలేక చాలామంది తెగ ఇబ్బంది పడుతూ ఉంటారు.అయితే అరిసెల్లో వాడే బియ్యం మరియు నువ్వులు శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి.
చలి పులిని తట్టుకునే సామర్థ్యాన్ని పెంచుతాయి.అలాగే అరిసెలను తీసుకోవడం వల్ల దానికి ఐరన్ పుష్కలంగా లభిస్తుంది.దాంతో రక్తహీనత సమస్య దూరమవుతుంది.అంతేకాదు అరిసెలను తీసుకోవడం వల్ల నీరసం అలసట వంటివి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.ఎముకలు దృఢంగా మారతాయి.మోకాళ్ళ నొప్పులు ఉంటే తగ్గు ముఖం పడతాయి.
కాబట్టి సంక్రాంతికి అరిసెలు తినడం అసలు మర్చిపోకండి.