అమెరికా అధ్యక్ష బరిలో రో ఖన్నా .. సెనేట్‌కి పోటీ చేస్తానంటే , ఈ ఊహాగానాలేంటీ..?

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరో రెండేళ్లు సమయం వుండగానే.అక్కడి రాజకీయ పార్టీలు, నేతలు అప్పుడే దానిపై దృష్టిపెట్టారు.

 Is Indian-american Congress Man Ro Khanna Eyeing 2024 Us Prez Bid , Former Presi-TeluguStop.com

ఇప్పటికే రిపబ్లికన్ పార్టీ నుంచి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికలకు సై అన్నారు.ప్రపంచానికి పెద్దన్న లాంటి అమెరికా అధ్యక్షుడి పోస్ట్ అంటే ఎవరికీ కోరిక వుండదు చెప్పండి.

దీనిలో భాగంగానే బైడెన్, ట్రంప్‌ల పార్టీల్లోని మరికొందరు కూడా రేసులో వున్నారు.అంతేందుకు డెమొక్రాట్ పార్టీకి ఎప్పటికైనా అధ్యక్ష అభ్యర్ధి కమలా హారిసేనని అమెరికా రాజకీయాల్లో వినపడుతున్న మాట.ప్రస్తుతానికి అధికార పార్టీ నుంచి ఆమె పేరొక్కటే వినిపిస్తుండగా.రాబోయే రోజుల్లో మరికొందరు కూడా రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తాజాగా భారత సంతతికే చెందిన యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా పేరు అమెరికా వ్యాప్తంగా మారుమోగుతోంది.

ప్రస్తుతం కాలిఫోర్నియా రాష్ట్రంలోని 17వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి ప్రజాప్రతినిధుల సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆయన.సెనేట్‌కు పోటీ చేయాలని భావిస్తున్నట్లు ప్రకటించారు.ఖన్నా మాటతో డెమొక్రాట్లు ఉలిక్కిపడ్డారు.

భవిష్యత్తులో అమెరికా అధ్యక్ష పదవికి ఆయన పోటీ చేయొచ్చనే చర్చ జరుగుతోంది.అన్ని అనుకున్నట్లుగా జరిగితే 2028 అధ్యక్ష ఎన్నికల్లో రో ఖన్నా పోటీపడే అవకాశాలు వున్నాయట.గతంలో 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి సంబంధించి ఖన్నా కుండబద్దలు కొట్టేశారు.2024లో బైడెన్ పోటీ చేయకుంటే తనకు ఆ పదవి కోసం పోటీపడే ఆలోచన లేదని తెలిపారు.బైడెన్ బరిలో వుంటే ఆయనకు మద్ధతుగా నిలుస్తానని స్పష్టం చేశారు.

Telugu Congressional, Biden, Iit Bombay, Kamala Harise, Michigan, Congressmanro-

ఇదిలావుండగా.పంజాబ్ నుంచి అమెరికాకు వలస వెళ్లిన హిందూ కుటుంబంలో జన్మించారు రో ఖన్నా.ఆయన తండ్రి ఐఐటీ బాంబే, యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్‌లో చదువుకోగా, తల్లి స్కూల్ టీచర్‌గా పనిచేశారు.

ఖన్నా తల్లి తరపు తాతగారు అమర్‌నాథ్ విద్యాలంకార్‌ భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు.లాలాలజ్‌పత్ రాయ్‌తో కలిసి ఉద్యమాలు చేసి జైలు శిక్ష కూడా అనుభవించారు.ఇక రో ఖన్నా యూనివర్సిటీ ఆఫ్ చికాగో నుంచి ఆర్ట్స్, ఎకనామిక్స్, హానర్స్‌లో డిగ్రీ చేశారు.డెమొక్రాటిక్ పార్టీకి గట్టి మద్ధతుదారైన రో ఖన్నాను 2009లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామర్స్‌లో అసిస్టెంట్ సెక్రటరీగా నియమించారు.

తర్వాత కాలిఫోర్నియా రాష్ట్రంలోని 17వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి ప్రజాప్రతినిధుల సభకు వరుసగా నాలుగు సార్లు ఎన్నికయ్యారు రో ఖన్నా.

Telugu Congressional, Biden, Iit Bombay, Kamala Harise, Michigan, Congressmanro-

అటు రిపబ్లికన్ పార్టీలో సైతం ఇదే వాతావరణం కనిపిస్తోంది.2024 ఎన్నికల కోసం డొనాల్డ్ ట్రంప్ రెండేళ్ల నాడే విరాళాల సేకరణపై దృష్టి పెట్టారు.దీనిలో భాగంగా ఫ్లోరిడాలోని తన రిసార్ట్‌లో కీలక నేతలు, దాతలతో ఆయన సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే.

ట్రంప్ కనుక పోటీ చేయకపోతే తాను 2024 ఎన్నికల్లో బరిలో దిగుతానని తేల్చిచెప్పారు భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ.పార్టీలో ట్రంప్ తర్వాత అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న వారి జాబితాలో నిక్కీ హేలీ అందరికంటే ముందు వున్నారు.

సౌత్ కరోలినా రాష్ట్రానికి గవర్నర్‌గా, ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా పనిచేసిన అనుభవం నిక్కీ సొంతం.అలాగే పార్టీలోనూ ఆమెకు మంచి గుర్తింపు, పట్టు వుంది.అన్నింటికీ మించి 2024లో డెమొక్రాట్ పార్టీ నుంచి కమలా హారిస్ కనుక బరిలో దిగితే.భారత సంతతి ఓట్లకోసం నిక్కీ హేలీని రిపబ్లికన్లు రంగంలోకి దించే అవకాశాలు లేకపోలేదు.

అయితే ట్రంప్ కనుక పోటీలో వుంటే తాను రేసులో నుంచి తప్పుకుంటానని ఆమె చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది.అప్పటికి పరిస్థితులు ఎలాంటి మలుపైనా తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube