వారంలో 2 సార్లు ఈ హెయిర్ స్ప్రేను వాడితే ఆ జుట్టు స‌మ‌స్య‌ల‌న్నీ ప‌రార్!

ప్ర‌స్తుత వ‌ర్షాకాలంలో హెయిర్ ఫాల్, హెయిర్ డ్యామేజ్‌, డ్యాండ్ర‌ఫ్‌, డ్రై హెయిర్ వంటి ఎన్నో జుట్టు సంబంధిత స‌మ‌స్య‌లు తీవ్రంగా స‌త‌మ‌తం చేస్తుంటాయి.వాటిని నివారించుకోవ‌డం కోసం ర‌క‌ర‌కాల హెయిర్ ప్యాకులు, మాస్క్‌లు వేసుకుంటారు.

 If You Use This Hair Spray 2 Times In A Week, All Those Hair Problems Will Be Re-TeluguStop.com

ఖ‌రీదైన హెయిర్ ఆయిల్స్‌, షాంపూలు, కండీషనర్స్ యూస్ చేస్తుంటారు.అయిన‌ప్ప‌టికీ ఎలాంటి ఫ‌లితం లేకుంటే ఏం చేయాలో అర్థంగాక మ‌ద‌న ప‌డిపోతూ ఉంటారు.

మీరు ఈ లిస్ట్‌లో ఉన్నారా.? అయితే టెన్ష‌న్ ప‌డ‌కండి.ఎందుకంటే, ఇప్పుడు చెప్ప‌బోయే హోం మేడ్ హెయిర్ స్ప్రేను వారంలో రెండు సార్లు వాడారంటే ఆయా జుట్టు స‌మ‌స్య‌ల‌న్నీ పరార్ అవ్వ‌డం ఖాయం.మ‌రి ఇంత‌కీ ఆ హెయిర్ స్ప్రేను ఎలా సిద్ధం చేసుకోవాలో చూసేయండి.

ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో అర క‌ప్పు బియ్యం వేసుకుని వాట‌ర్‌తో ఒక‌సారి వాష్ చేసుకోవాలి.ఆ త‌ర్వాత అందులో ఒక‌టిన్న‌ర గ్లాస్ వాట‌ర్ పోసి నైట్ అంతా వ‌దిలేయాలి.

ఉద‌యాన్నే వాట‌ర్‌ను మాత్రం స‌ప‌రేట్ చేసుకోవాలి.ఇప్పుడు స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో స‌ప‌రేట్ చేసి పెట్టుకున్న రైస్ వాట‌ర్‌, రెండు తుంచిన మందారం ఆకులు, రెండు తుంచిన మందారం పువ్వులు, వ‌న్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకుని ప‌ది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు మ‌రిగించాలి.

Telugu Dandruff, Care, Care Tips, Fall, Problems, Spray, Healthy, Latest, Long-T

ఆ త‌ర్వాత స్ట‌వ్ ఆఫ్ చేసి వాట‌ర్‌ను ఫిల్ట‌ర్ చేసుకోవాలి.ఈ వాట‌ర్ ను కంప్లీట్‌గా కూల్ అయిన వెంట‌నే బాటిల్‌లో నింపుకుని జుట్టు కుదుళ్ల నుంచి చివ‌ర్ల వ‌ర‌కు స్ప్రే చేసుకోవాలి.గంట అనంత‌రం మైల్డ్ షాంపూను యూస్ చేసి హెయిర్ వాష్ చేసుకోవాలి.ఈ హెయిర్ స్ప్రే ను వారంలో రెండు సార్లు వాడితే.జుట్టు రాల‌డం, పొట్లిపోవ‌డం, పొడిబార‌డం వంటివి త‌గ్గుతాయి.కురులు ఒత్తుగా, పొడ‌వుగా పెరుగుతాయి.

మరియు చుండ్రు స‌మ‌స్య నుండి సైతం ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube