ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సైన్యం కలిగిన అయిదు దేశాలు - వాటి బలగం

మనం తెల్లారి నిద్రలేచి మన పనులు చేసుకుంటున్నాం.రాత్రి ఎలాంటి భయం లేకుండా సుఖంగా నిద్రపోతున్నాం.

ఈ జీవితం ఇంత సురక్షితంగా ఉంది అంటే దానికి కారణం, మన సైన్యం.మీకు తెలుసో లేదో కాని, మన భారత సైన్యం ప్రపంచంలోనే మూడోవ అతిపెద్దది.

 Top-5 Powerful Military Countries In The World .. India In The List-Top-5 Powerful Military Countries In The World .. India In The List-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అలాగే శక్తివంతమైన సైన్యం కలిగిన దేశాల్లో నాలుగోవ స్థానం మన దేశానిది.అధునాతన మిసైల్స్ మన ఆస్తి.

అందుకే యుద్ధానికి వచ్చిన పాకిస్తాన్ తట్టుకోలేకపోయింది.గొడవకు దిగిన చైనా సర్దుకుంది.

అందుకే గ్లోబల్ ఫైర్ పవర్ ర్యాంకుల ప్రకారం ఇండియన్ ఆర్మీ ప్రపంచ ర్యాంకు నాలుగు.

అయితే, అమెరికా దగ్గర ఉన్న టెక్నాలజీ, అస్త్రాల ముందు మిగితా దేశాలు చిన్నగానే కనిపిస్తాయి.ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆర్మీ అమెరికా సొంతం.$689 బిలియన్ల బడ్జెట్ అమెరికా సైన్యానికి కేటాయిస్తుంది.ఈ బడ్జెట్ దరిదాపుల్లోకి, చైనాతో కలిపి ఏ దేశం రాలేదు.అన్ని రకాల వసతులు, శక్తివంతమైన అస్త్రాలు వీరి సొంతం.చైనా కన్నా సైనికుల జనాభా తక్కువే అయినా, అమెరికా సైనిక శక్తి ఇప్పట్లో మరో దేశం అందుకోలేనంత ఎత్తులో ఉంది.

ఇక మన శత్రుదేశం పాకిస్తాన్ ది ప్రపంచంలో ఆరోవ అతిపెద్ద సైన్యం.

కాని శక్తివంతమైన సైన్యం కలిగిన పది దేశాల్లో కూడా దీనికి స్థానం దక్కకపోవడం ఆశ్చర్యకరం.అలాగని పాకిస్తాన్ ని తక్కువ అంచనా వేయడానికి లేదు.భారత్ చేతిలో పలుమార్లు పరాభావానికి లోనయినా, బయటి లెక్కలకి తెలియని అణుఅస్త్రాలు పాకిస్తాన్ అమ్ములపొదిలో ఉన్నాయి.కాబట్టి ఇది కూడా ప్రమాదకరమైన దేశమే.

ఇక ఆలస్యం చేయకుండా, ప్రపంచంలో శక్తివంతమైన సైన్యం కలిగిన మొదటి అయిదు దేశాలు ఏంటో, వారి బడ్జెట్, బలగం ఏంతో చూడండి.

#1.అమెరికా

పవర్ ఇండెక్స్ : 0.2475 డిఫెన్స్ బడ్జెట్ : $689,591,000,000 మిలిటరీ : 1,477,896 లేబర్ ఫోర్స్ : 153,600,000 వాయుసేన : 15,293 నౌకాదళం : 290 మిలిటరీ ర్యాంక్ – 2

#2.రష్యా

పవర్ ఇండెక్స్ : 0.2618 డిఫెన్స్ బడ్జెట్ : $64,000,,000,000 మిలిటరీ : 1,20,000 లేబర్ ఫోర్స్ : 75,3330,000 వాయుసేన : 4,498 నౌకాదళం : 224 మిలిటరీ ర్యాంక్ – 5 మిలిటరీ ర్యాంక్ – 2

#3.చైనా

పవర్ ఇండెక్స్ : 0.3351 డిఫెన్స్ బడ్జెట్ : $129,22,000,000 మిలిటరీ : 2,285,000 లేబర్ ఫోర్స్ : 795,500,000 వాయుసేన : 5,048 నౌకాదళం : 972 మిలిటరీ ర్యాంక్ – 1

#4.ఇండియా

పవర్ ఇండెక్స్ : 0.4346 డిఫెన్స్ బడ్జెట్ : $44,282,000,000 మిలిటరీ : 1,325,000 లేబర్ ఫోర్స్ : 487,600,000 వాయుసేన : 1,962 నౌకాదళం : 170 మిలిటరీ ర్యాంక్ – 3

#5.యునైటెడ్ కింగ్డమ్

పవర్ ఇండెక్స్ : 0.5185

డిఫెన్స్ బడ్జెట్ : $57,875,170,000

మిలిటరీ : 224,500

లేబర్ ఫోర్స్ : 31,720,000

వాయుసేన : 1,412

నౌకాదళం : 77

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు