న్యూస్ రౌండప్ టాప్ 20

1.సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల

  సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ( సీబీఎస్సీ) 12వ తరగతి పరీక్ష ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. 

2.వరద నష్టం పై షర్మిల డిమాండ్

 Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold-TeluguStop.com

Telugu Apcm, Bandi Sanjay, Chandrababu, Cm Kcr, Corona, Manchu Lakshmi, Ktr, Mon

తెలంగాణలో వరదలు కారణంగా నష్టపోయిన వారికి పరిహారంగా పది వేలు కాదని , 25 వేలు ఇవ్వాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు. 

3.భద్రాద్రి వద్ద తగ్గుతున్న వరద ప్రవాహం

  భద్రాద్రి వద్ద వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది.ఇప్పటివరకు వరదల కారణంగా భద్రాచలం పరిసర ప్రాంతాలలో జనజీవనం స్తంభించిపోయింది. 

4.భారత్ లో కరోనా

Telugu Apcm, Bandi Sanjay, Chandrababu, Cm Kcr, Corona, Manchu Lakshmi, Ktr, Mon

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 22,880 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

5.50 స్కూళ్లను దత్తత తీసుకున్న మంచు లక్ష్మి

  తెలంగాణలో నిర్వహిస్తున్న మన ఊరు – మనబడి కార్యక్రమంలో భాగంగా సినీ నటి మంచు లక్ష్మి 50 స్కూళ్లను దత్తత తీసుకున్నారు. 

6.హుస్సేన్ సాగర్ లోనే గణేష్ విగ్రహాల నిమజ్జనం

Telugu Apcm, Bandi Sanjay, Chandrababu, Cm Kcr, Corona, Manchu Lakshmi, Ktr, Mon

హుస్సేన్ సాగర్లోని గణేష్ నిమజ్జనం చేసి తీరుతామని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంత్ రావు స్పష్టం చేశారు. 

7.మంత్రి పువ్వాడ అజయ్ వ్యాఖ్యలపై సిపిఐ నారాయణ కామెంట్స్

  పోలవరం ప్రాజెక్టు విషయంలో తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. 

8.బండి సంజయ్ పై కేటీఆర్ కామెంట్స్

Telugu Apcm, Bandi Sanjay, Chandrababu, Cm Kcr, Corona, Manchu Lakshmi, Ktr, Mon

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కామెంట్స్ చేశారు.తెలంగాణ సీఎం కేసీఆర్ ఈడీ విచారణ ఎదుర్కోవాల్సిందేనంటూ బండి సంజయ్ కామెంట్ చేయగా,  దానికి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.బండి సంజయ్ ను ఈడికి కూడా చీఫ్ గా నియమించినందుకు ధన్యవాదాలు అంటూ వెటకారం చేశారు. 

9.ఉచిత బియ్యాన్ని తప్పకుండా పంపిణీ చేయాల్సిందే

  ఉచిత బియ్యాన్ని తప్పకుండా అన్ని రాష్ట్రాలు పంపిణీ చేయాల్సిందేనని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ అన్నారు. 

10.ముంపు ప్రాంతాల్లో సోమ వీర్రాజు పర్యటన

Telugu Apcm, Bandi Sanjay, Chandrababu, Cm Kcr, Corona, Manchu Lakshmi, Ktr, Mon

రాజమండ్రిలోని హుకుంపేటలో మురుగునీటి వంపునకు గురైన ప్రాంతాల్లో ఏవి బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటించారు. 

11.నల్ల బెల్లం నిల్వ, రవాణా నేరం కాదు : హై కోర్ట్

  నల్ల బెల్లం ను నిల్వ చేయడం, రవాణా చేయడం నేరం కాదని హైకోర్టు ఓ కేసు లో విచారణ సందర్భంగా వ్యాఖ్యానించింది. 

12.రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపిన టిడిపి ఎంపీలు

Telugu Apcm, Bandi Sanjay, Chandrababu, Cm Kcr, Corona, Manchu Lakshmi, Ktr, Mon

భారత రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము కు టిడిపి ఎంపీలు శుభాకాంక్షలు తెలియజేశారు. 

13.ఏపీ ప్రభుత్వంపై చంద్రబాబు కామెంట్స్

  పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం లోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న టిడిపి అధినేత చంద్రబాబు ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.ఇది దొంగ ప్రభుత్వం, దోపిడీ ప్రభుత్వం అంటూ మండిపడ్డారు. 

14.ఏపీ హైకోర్టులో  2.35 లక్షల పెండింగ్ కేసులు

Telugu Apcm, Bandi Sanjay, Chandrababu, Cm Kcr, Corona, Manchu Lakshmi, Ktr, Mon

ఏపీ హైకోర్టులో 2.35 లక్షల పెండింగ్ కేసులు ఉన్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. 

15.8 నుంచి శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు

  తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆగస్టు 8 నుంచి 10 వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. 

16.అక్రమ కేసులకు కాంగ్రెస్ భయపడదు

Telugu Apcm, Bandi Sanjay, Chandrababu, Cm Kcr, Corona, Manchu Lakshmi, Ktr, Mon

అక్రమ కేసులకు కాంగ్రెస్ భయపడదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ అన్నారు. 

17.మూడో మంకీ ఫాక్స్ కేసు నమోదు

  భారత్ లో మూడో మంకీ ఫాక్స్ కేసు నమోదయింది.కేరళలో 35 ఏళ్ల వ్యక్తికి ఈ వైరస్ సోకింది. 

18.మాజీ సిఐ నాగేశ్వరావు ముగిసిన కస్టడీ

Telugu Apcm, Bandi Sanjay, Chandrababu, Cm Kcr, Corona, Manchu Lakshmi, Ktr, Mon

మహిళపై అత్యాచారం కేసులో మాజీ సీఐ నాగేశ్వరావు కస్టడీ ముగియడంతో పోలీసులు హయత్ నగర్ కోర్టు ముందు హాజరు పరిచారు.అనంతరం జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించారు. 

19.94 యుట్యూబ్ ఛానెళ్ల పై నిషేధం

  2021-22 లో తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్న  94 యూట్యూబ్ ఛానెళ్లు, 19 సామాజిక మాధ్యమాల అకౌంట్ల పై నిషేధం విధించినట్లు కేంద్ర సమాచార,  ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. 

20.ఈ రోజు బంగారం ధరలు

Telugu Apcm, Bandi Sanjay, Chandrababu, Cm Kcr, Corona, Manchu Lakshmi, Ktr, Mon

22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 46,400
  24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 50,620  

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube