ఈ ప్రపంచంలో ఎంతోమంది ధనికులు ఉన్నారు.వారిలో చాలామంది తమ డబ్బును ఓన్లీ మంచి ప్రయోజనాల కోసమే ఖర్చు పెడతారు.
అలానే అతిగా ఖర్చు పెట్టడానికి ఆసక్తి చూపరు.కొందరు మాత్రం ఇందుకు విభిన్నం.
తమ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని విచ్చలవిడిగా ఖర్చు చేస్తుంటారు.అది వారి కష్టార్జితం కాబట్టి దాన్ని ఎలా ఖర్చు పెట్టుకోవాలనేది వారి ఇష్టం కానీ ఒక్కోసారి వాళ్లు జరిపే కొనుగోళ్లను చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే.
తాజాగా ఒక ఎన్నారై( NRI ) చేసిన పని కూడా అలానే ఉంది.
డాక్టర్ మల్టీమీడియా సీఈఓ అజయ్ ఠాకూర్ ( Dr.Multimedia CEO Ajay Thakur )తన కుక్క కోసం లూయిస్ విట్టన్ బ్రాండ్‌కు చెందిన “బోన్ ట్రంక్”( Bone Trunk ) అనే ఖరీదైన సూట్‌కేస్‌ను కొన్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.ఈ వీడియోలో ఆయన లూయిస్ విట్టన్ స్టోర్‌లోకి వెళ్లి, “నా కుక్కకు కొన్ని వస్తువులు తీసుకోవాలని అనుకుంటాను” అని అంటారు.
ఆ తర్వాత ఆయన కుక్క కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఎముక ఆకారంలో ఉన్న హార్డ్‌షెల్ సూట్‌కేస్‌ను( hardshell suitcase ) ప్రదర్శిస్తారు.ఈ సూట్‌కేస్‌తో పాటు పాలిష్ చేసిన వుడెన్ ట్రే, రెండు బౌల్స్ కూడా వస్తాయి.
అజయ్ ఠాకూర్ ఈ హార్డ్‌షెల్ సూట్‌కేస్‌ను ప్రదర్శిస్తూ, “అస్పెన్ (ఆయన కుక్క పేరు) డబ్బును ఖర్చు పెట్టడంలో ఎప్పుడు వెనకాడదు.ఈ లూయిస్ విట్టన్ బోన్ ట్రంక్ ధర 20,000 డాలర్లు (రూ.17 లక్షలు)” అని రాశారు.ఈ వీడియో చూసిన కొంతమంది ఈయన నిర్ణయాన్ని అభినందిస్తూ, తన పెంపుడు జంతువును చాలా గొప్పగా ప్రేమిస్తున్నారుగా అని కామెంట్ చేశారు.
మరికొందరు “అనవసరమైన వస్తువులపై డబ్బు వృథా చేయడం అంటే ఇదేనా?” అని ప్రశ్నించారు.మరొకరు, “నేను ప్రయాణించే దానికంటే ఈ కుక్క బాగా ప్రయాణిస్తుంది!” అని వ్యాఖ్యానించారు.
ఈ సూట్‌కేస్ కోసం ఖర్చు చేయడం కంటే ఆ డబ్బుతో చాలా హోమ్ లెస్ యానిమల్స్‌కు సహాయం చేయవచ్చని మరికొందరు అంటున్నారు.ఈ మనీని యానిమల్ ఫౌండేషన్‌కి దానం చేసిన బాగుండేది కదా అని ఇంకొందరు అన్నారు.