లేటు వయసులో పెళ్లి పీటలు ఎక్కిన నటుడు సుబ్బరాజు... ఫోటోలు వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా పెళ్లి భాజాలు మోగుతున్నాయి.త్వరలోనే నాగచైతన్య శోభిత పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.

 Tollywood Actor Subbaraju Wedding Photo Goes Viral , Subbaraju, Wedding, Tollywo-TeluguStop.com

అలాగే డిసెంబర్ 11వ తేదీ తిరిగి కీర్తి సురేష్ వివాహం కూడా జరగబోతుంది.ఇకపోతే ఇటీవల నాగార్జున అఖిల్ ఎంగేజ్మెంట్ గురించి కూడా తెలియజేస్తూ మరో శుభవార్తను తెలిపారు.

అఖిల్ ఎంగేజ్మెంట్ కూడా జరిగిందని నాగార్జున అధికారకంగా వెల్లడించారు.ఇలా వరుసగా సెలబ్రిటీలో పెళ్లి చేసుకోబోతున్న నేపథ్యంలో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా మరొక టాలీవుడ్ కమెడియన్ విలన్ అయినటువంటి సుబ్బరాజు కూడా పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు.

Telugu Bahubali, Subbaraju, Tollywood-Movie

టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ గాను అలాగే విలన్ పాత్రలలోను నటిస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సుబ్బరాజు ( Subbaraju ) ఐదు పదల వయసుకు చేరువ అవుతున్న సమయంలో పెళ్లి ( Marriage ) చేసుకున్నారు.ఇలా లేటు వయసులో ఈయన పెళ్లి చేసుకున్నారనే విషయం తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం ఈయన పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Telugu Bahubali, Subbaraju, Tollywood-Movie

ఇక సుబ్బరాజు పెళ్లి చేసుకున్న ఆ అమ్మాయి ఎవరు ఏంటి అనే విషయాలను మాత్రం ఎక్కడా వెల్లడించలేదు.ఇక వీరిద్దరూ పెళ్లి చేసుకొని బీచ్ పక్కన నిలబడి ఉన్నటువంటి ఫోటోని ఈయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇక ఈయన ఖడ్గం సినిమా ( Khadgam Movie ) సమయంలో కృష్ణవంశీ ( Krishna Vamsi )వద్ద అసిస్టెంట్ గా చేరి అనంతరం నటుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతూ వచ్చారు.

ఇక బాహుబలి సినిమా ద్వారా ఈయన పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పట్ల బిజీగా ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube